సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి : ఆజాది కా అమృత్ మహోత్సవ్ ముగింపు కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు మేరీ మాట్టి మేరా దేశ్(నా భూమి నా దేశం) కార్యక్రమంలో భాగంగా మఠంపల్లి మండలంలోని బక్కమంతులగుడెం గ్రామంలో అసెంబ్లీ కన్వీనర్ వేముల శేఖర్ రెడ్డి మండల అధ్యక్షులు దుండిగాల యల్లయ్య గ్రామశాఖఅధ్యక్షులు ములగొండ్ల వెంకటరెడ్డి, నిమ్మల నాగమణి, ఆధ్వర్యంలో అమృత కలశంలో మట్టిని సేకరించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనం పుట్టిన ఈ నెలను మట్టికి నమస్సుమాంజనులు తెలియజేస్తూ ఈ మట్టిలో పుట్టిన వీరులకు వందనం సమర్పణ భావంతో దేశం కోసం ప్రాణాలను అర్పించిన వీరులను స్మరించుకునే విధంగా దేశ రాజధాని ఢిల్లీ లో స్తూప నిర్మాణని కై పార్టీలకతీతంగా దేశభక్తులు అందరూ కూడా ప్రతి గ్రామం నుండి ఈ నేల మట్టి సేకరణ జరుగుతుందని నేను పుట్టిన ఈ నేల నన్ను కన్న నా దేశం మన మట్టికి నమస్సుమాంజలు తెలియజేస్తూ మన వీరులకు వందనాలు అనే నినాదంతో ముందుకు సాగాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతాల పుల్లయ్య, మండల మోర్చా అధ్యక్షుడు బోబ్బ వీరారెడ్డి, చడపంగు ఈదయ్య, మంద వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin