సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : హయత్ నగర్ డివిజన్ పరిధిలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఎంఆర్ డిసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. 'మన బస్తీ - మన బడి' కార్యక్రమంలో భాగంగా శనివారం హయత్నగర్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో రూ.48 లక్షల 47 వేల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డితో కలిసి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి శంకుస్థాపన చేశారు. పాఠశాలలో ప్రహారీ, నిర్మాణం, మూత్రశాలలు, ఫర్నీచర్ వంటి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం హయాంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. హయతనగర్ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను తీర్చడానికి కృషిచేస్తానని హామీనిచ్చారు. ఈకార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ హయత్ నగర్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్ గౌడ్, నాయకులు భాస్కర్ సాగర్, సింగిరెడ్డి మల్లీశ్వరి, దర్శన్ గౌడ్, శ్రావణ్, భిక్షపతి, స్కూల్ ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin