సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : అహ్మదాబాద్‌లో ఒకటి కాదు రెండు కాదు మొత్తం 150 యాక్టీవాలను దొంగిలించిన కోటీశ్వరుడు దొంగ పట్టుబడ్డాడు. వాస్తవానికి హితేష్ జైన్ కు లగ్జరీ కార్లలో ప్రయణం అంటే చాలా ఇష్టం.. దీంతో తన కోరికను తీర్చుకోవడానికి దొంతతనాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. హితేష్ జైన్ యాక్టివాలను దొంగిలించడం ప్రారంభించాడు. ప్రతిరోజూ ఒక యాక్టివాను దొంగిలించేవాడు. అయితే, దొంగిలించిన ఈ యాక్టివాలను అతడు ఎవరికీ విక్రయించలేదు. అలా దొంగిలించిన యాక్టివాతో వివిధ ప్రాంతాలలో తిరిగేవాడు. ఆ తర్వాత యాక్టివాలో పెట్రోల్ అయిపోయిన తర్వాత దానిని పట్టించుకోకుండా వదిలేసేవాడు. ఈ విధంగా అహ్మదాబాద్‌లోని వివిధ ప్రాంతాలలో సుమారు 150కి పైగా యాక్టివాలు దొంగిలించబడ్డాయి. యాక్టివా దొంగతనం గణాంకాలు పెరుగుతున్నాయి. ఈ సమాచారం క్రైమ్ బ్రాంచ్ కి చేరగా రంగంలోకి దిగి దర్యాప్తు చేశారు. నిందితుడు దొంగిలించిన యాక్టివాపై ప్రయాణం చేస్తూ పిరానాలో పట్టుబడ్డాడు. గత మూడు నెలల్లో దాదాపు 70 యాక్టివాలు దొంగిలించాడని పిరానా సమీపంలోని ఓపెన్ గ్రౌండ్‌లో కొన్ని యాక్టివాలు ఉంచినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడి నుంచి 20 చోరీ ఆస్తులను క్రైం బ్రాంచ్ స్వాధీనం చేసుకుంది.
-----------------------
Admin