సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డులో 1971లో ఆనాటి ప్రభుత్వం 61 వ్యాపారస్తుల వద్ద నుండి వ్యాపారం గోదాముల కోసం డబ్బులు కట్టించుకొని ఇప్పటివరకు వ్యాపారం గోదాములకు పర్మిషన్ ఇవ్వడంలేదని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, వాణిజ్య పంటలైన పసుపు, మొక్కలు జొన్న, వరి, సోయా, సజ్జలకు పేరుగాంచిన ప్రాంతం, అభివృద్ధి పొందుతున్న ఈ మార్కెట్ యార్డ్ 'గంజ్'లో ఉన్న లేనట్లే. కారణం వ్యవసాయ మార్కెట్ కమిటీ వారు ఎన్.ఓ.సి ఇవ్వడం లేదని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, దుకాణాలు, గోదాములు నిర్మాణాలు జరిగేందుకు కమిటీ వారు ఎన్ఓసి ఇవ్వని కారణంగా చుట్టుపక్క ప్రాంతాలకి ఇదే మేజర్ యాడ్ కావడంతో ఎటువంటి అభివృద్ధి కావట్లేదని స్థానికులు, ఆర్మూర్, బాల్కొండ, మరియు భీంగల్ ప్రజలు అనుకుంటున్నారు. ఆర్మూర్ ఏఎంసీ అరవై రెండు ఫ్లాట్ల రిజర్వేషన్ కొరకు నాటి నుండి నేటి వరకు అనేక మార్లు అధికారులకు విన్నపాలు విన్నవించుకున్నారు. గత నెల జిల్లా కలెక్టర్ కి జిల్లా మార్కెట్ కమిటీ అధికారి కి ఆర్మూర్ రెవెన్యూ అధికారి కి ఆర్మూర్ తాసిల్దార్ కి ఆర్మూర్ పట్టణం మున్సిపాలిటీ కమిషనర్ కి ఆర్మూర్ మార్కెట్ కమిటీ సెక్రటరీ మేడం కి కలిసి వారి యొక్క ప్లాట్లలో నిర్మాణం మరియు వ్యాపారం కోసం విన్నవించుకున్నారు. నిర్మాణాలు చేపట్టేందుకు ఎన్.ఓ.సి జారీ చేయవలసిందిగా కోరారు. దుకాణం కట్టుకొనటకు పర్మిషన్ ఇవ్వాలని అభ్యర్థులు విన్నవించుకున్నారు కానీ ఆరోజు నుండి ఈరోజు వరకు ఎటువంటి జవాబు రానందున ఈరోజు మా ఫ్లాట్లను సర్వే చేయించి పూర్తి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇవ్వాలని భీష్పించుకొని కూర్చున్నారు. మార్కెట్ సిబ్బంది అడ్డగించి దుర్భాషలాడి బయటకు నెట్టివేశారు. 1973లో రీసెంట్ డాక్యుమెంట్లతో ఎన్నోసార్లు అనగా 1978 నుండి 2017 అనుమతి కొరకు అభ్యర్థన చేసుకున్నప్పటికీ ఎటువంటి జాబు రాలేదని మూడు తరాల మారిన వారి తలరాత మారలేదని, ఇప్పటివరకు ఏఎంసీలో ఎటువంటి వ్యాపారాలు గాని లావాదేవీలు కానీ ప్రభుత్వాలు పోచం ఇవ్వడం లేదు 62 ప్లాట్ లలో వెంటనే ఎన్ఓసి ఇచ్చి నిర్మాణాలకు మరియు వ్యాపారులు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని 100 కుటుంబాలు జీవన ఉపాధి కలుగుతుందని రైతులు తాము జీవన ఉపాధి కలుగుతుందని రైతులకు తాము పండించిన పంటలు దూరప్రాంతాలకు తరలి వెళ్లలేమని, మాకు న్యాయమైన డిమాండ్ ను వెంటనే పరిష్కరించగలరని. అధ్యక్షులు ఐజాపూర్ చంద్రప్రకాష్, కార్యదర్శి మల్లికార్జున్, మార్కెట్ అధికారులకు కోరారు. ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యక్షులు అయ్యాపూర్ దేవేందర్, సలాద రాజు శర్మ జీవన్ జీ, భూమయ్య, ముక్క రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin