సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చిన సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ... రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర ఫలితమే ఈ గెలుపు అని అన్నారు. బిజెపి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా డబ్బులు పంచిన ప్రజలే అసలైన తీర్పుదారులని ఈ తీర్పు బిజెపికి చెంపపెట్టు లాంటిదని అన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. ఈ సంబరాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin