సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ఈ నెల 8న మహాశివరాత్రి సందర్బంగా నిర్వహించనున్న మేళ్ళచెర్వులోని స్వయంభు శంభు లింగేశ్వర స్వామి జాతరకు ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్.లత తెలిపారు.సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జాతర ఏర్పాట్లపై జిల్లా అడిషనల్ ఎస్పీ నాగేశ్వరావుతో కలిసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జాతరకు పకడ్బందీ ఏర్పాటు చేయాలని. శాఖల వారీగా నిర్దేశించిన పనులను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. వాహనాల పార్కింగ్, ఆలయ ప్రాంగనంలో బారికేడ్ల ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. గుడి ప్రాంగణంలో లైటింగ్ బార్కెట్స్ ఏర్పాటు చేయాలని, ఆలయ ప్రాంగనం చుట్టూ చదును చేసి ప్రభల ఏర్పాట్లకు సిద్దం చేయాలని పంచాయతీరాజ్ అదికారులను ఆదేశించారు. భక్తులకు సౌకర్యార్థం అన్ని రూట్లో బస్సులను నడపాలని ఆర్‌టిసి అధికారులకు సూచించారు. శానిటేషన్, భక్తులకు త్రాగునీరు ఏర్పాట్లు పరిశీలించాని డిఎల్‌పిఓ, ఎంపీడీవోలు ,తాహశీల్దార్‌లకు సూచించారు. తాత్కాలిక టాయిలెట్స్ నిర్మాణం, మహిళల కొరకు ప్రత్యేకంగా షీ– టాయిలెట్స్ ఏర్పాటు చేయాలన్నారు. దేవాలయం చుట్టుపక్కల నిరంతర కరెంటు ఉండేటట్లుగా విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల సేవల కొరకు ఎన్జీవోలను, ఎన్‌సీసీ విద్యార్థుల సేవలను ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారి రూపేందర్ సింగ్, సూపరిడేంట్ పద్మారావు, రోడ్డు భవనాల శాఖ అధికారిని ప్రియదర్శిని, ఎంపీడీవో ఆలీ , ఆర్టీసీ డిఎం సురేందర్, తాహశీల్దార్ జ్యోతి ,అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
-----------------------
Admin