సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం (మున్సిపాలిటీ): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ లిస్ట్ ల వెరిఫికేషన్ మరియు కొత్త ఓటర్లను చేర్చుకోవడం ,అడ్రస్ మార్పులు , తప్పుల సవరణ చేసుకోవాలని పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం నేతాజీ హై స్కూల్ ,నేతాజీ ప్రైమరీ స్కూల్లో బూత్ లెవెల్ అధికారులతో ఏర్పాటుచేసిన ఓటర్ లిస్టు శిబిరాల ను సందర్శించి ఆమె మాట్లాడుతూ 26 ,27 తేదీలలోనూ మరియు సెప్టెంబర్ 2, 3 తారీకుల్లో శని ,ఆదివారాల్లో పోలింగ్ బూత్ లో కొత్త ఓటర్ల చేర్పులు ,అడ్రస్ మార్కులు, తప్పుల సవరణ కు దరఖాస్తులు తీసుకోబడతాయని అలాగే ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు ఓటర్ లిస్టులో ఉన్నదో లేదో ఓటర్ లిస్ట్ ను పరిశీలించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 1/ 10 /2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఆధార్ కార్డు జిరాక్స్ ఎస్ ఎస్ సి మెమో జిరాక్స్ ,ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తెచ్చుకొని పోలింగ్ కేంద్రాల్లో ఇచ్చే దరఖాస్తు లను పూర్తి చేసి అక్కడ అధికారులకు ఇచ్చి ఓటు హక్కును పొందాలని ఆమె యువతకు విజ్ఞప్తి చేశారు. అనేక సందర్భాల్లో బిఎల్వోలు ఇంటింటికి తిరిగి సర్వే చేసినప్పటికీ కంప్యూటర్ ఆపరేటర్ల తప్పిదాలతో మళ్లీ అవే తప్పులు దొర్లుతున్నాయని, ఏరకంగా వార్డుల వారీగా డివైడ్ చేస్తున్నారో అర్థం కాని అయోమయ స్థితిలో ప్రజలు పోలింగ్ బూతుల చుట్టూ తిరుగుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తప్పులు లేనటువంటి ఓటర్ లిస్టును ప్రచురించాలని ఆమె అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు శ్రీరాములు, కృష్ణ ,బి ఎల్ ఓ ,అంగన్వాడి టీచర్ పద్మ, వై నాగమణి, అలివేలు మంగతాయారు, టి జ్యోతి, కే రాధిక, మరియు ఓటర్లు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin