సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ రోజు షాద్ నగర్ పట్టణం ఈడెన్ ప్లాజాలో వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఆరోగ్య దినోత్సవంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. అనంతరం గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లు ప్రారంభించి పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్ల అనతి కాలంలో తెలంగాణ వైద్యారోగ్య రంగం అద్భుత ప్రగతి సాధించడం జరిగింది. సీఎం కేసీఆర్ మార్గ నిర్దేశంలో దేశానికి రోల్ మోడల్ గా మారిన ఆరోగ్య తెలంగాణ మోడల్ మనది. 21 కోట్లతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణపనులు వేగంగా జరుగుతున్నాయి. షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 60 లక్షల వ్యయంతో 5 మెషిన్స్ తో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. షాద్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా 33 పల్లె దవాఖానలు, ఒక బస్తీ దవాఖాన, యూపీహెచ్సీ మంజూరు చేయించడం జరిగింది. షాద్ నగర్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 8730 కేసీఆర్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. కంటి వెలుగు మొదటి దశలో 1,71,577 మందికి కంటి పరీక్షలు చేయడం జరిగింది, అందులో 29,162 మందికి రీడింగ్ గ్లాసెస్స్ మరియు 16,306 మందికి ప్రెస్క్రిప్షన్ గ్లాసెస్స్ పంపిణీ చేయడం జరిగింది. కంటి వెలుగు రెండవ దశలో ఇప్పటివరకు 1,21,789 మందికి కంటి పరీక్షలు చేయడం జరిగింది, ఇంకా కంటి పరీక్షలు కొనగతున్నాయి, అందులో 13,708 మందికి రీడింగ్ గ్లాసెస్స్ మరియు 6,237 మందికి ప్రెస్క్రిప్షన్ గ్లాసెస్స్ పంపిణీ చేయడం జరిగింది. షాద్ నగర్ నియోజకవర్గంలో 607 న్యూట్రిషన్ కిట్లు గర్భిణీ స్త్రీలకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, డిప్యూటీ హెచ్ఎంఓ జయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ నరేందర్, ఎంపీపీ ఈద్రిష్, జిల్లా వైస్ చైర్మన్, కొత్తూరు జెడ్పిటిసి లలిత, డివిజన్ సంబంధించిన ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, ఎంఈఓ లు, డివిజన్ అధికారులు, రంగారెడ్డి జిల్లా మాస్ మీడియా ఆఫీసర్ పి నరహరి, అన్ని ప్రాథమిక వైద్య అధికారులు, హెల్త్ ఎడ్యుకేటర్ జై శ్రీనివాసులు, హెల్త్ సూపర్వైజర్లు, షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ శ్రీనివాసులు, వారి డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, స్టాఫ్ నర్స్ లు, ఏఎన్ఎంలు, ఆశలు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈట గణేష్, జెడ్పిటిసిలు వెంకట్రామిరెడ్డి, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్, జడ్పిటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి, ఐసీడిఎస్, సిడిపివో నాగమణి, డిఎమ్ ఎచ్ఓ జయలక్ష్మి, షాద్ నగర్ మున్సిపల్ కమిషనర్ వెంకన్న, చైర్మన్ కొందుటి నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, నారాయణరెడ్డి, ఎంపీడీవో వినయ్ కుమార్, కొత్తూరు, నందిగామ, కొందుర్గు జెడ్పిటిసిలు, ఎంపిపిలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin