Monday, 27 July 2026 06:40:00 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

9 ఏళ్లుగా సాకారం కాని తెలంగాణ ప్రజల కలలు...

Date : 16 February 2023 12:30 AM Views : 811

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : రాష్ట్రంలో కేవలం కేసీఆర్ నామస్మరణ జపం చేయాలనే తపన. ఆరాటం తప్ప అధికార పార్టీకి మరో ధ్యాస లేదని బి ఆర్ ఎస్ అసంతృప్తి నేత మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం తెలంగాణ సాధించిన తొమ్మిది ఏళ్ల లో ప్రజల కలలు సాకారం కాలేదనీ, 15 నెలలు గడుస్తున్నా ధరణి వెబ్సైట్ లో నెలకొన్న వందల సంఖ్యలో సమస్యలను పరిష్కరించాలనే ధ్యాస ప్రభుత్వానికి లేదన్నారు. కరోనా కష్టకాలం వల్ల రైతుల రుణమాఫీ చేయలేదని చెబుతున్న ప్రభుత్వం వందల కోట్ల రూపాయల నిధులతో ఒక సచివాలయం ఉండగానే మరో సచివాలయాన్ని గొప్పల కోసం నిర్మిస్తోందన్నారు. విద్యా వైద్యం సాగునీటి రంగాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనీ, ప్రభుత్వం మేకపోతు గాంభీర్యంతో నిజాలను నిజంగా ఒప్పుకోవటం లేదని” ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. వైరాలోని వైష్ణవి మిల్క్ ఫ్యాక్టరీ సమీపంలో జాతీయ రహదారి పక్కన బుధవారం పొంగులేటి అభిమానుల వైరా నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. రాష్ట్ర మార్కెఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన సభలో పొంగులేటి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడిచిన తొమ్మిది సంవత్సరాలలో ప్రజల కలలు సాకారం కాలేదని విమర్శించారు. అధికారంలో ఉన్న నాయకులు ఈ విషయంపై ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో కేవలం కేసీఆర్ నామస్మరణ జపం చేయాలనే తపన తప్ప ప్రజల సమస్యలపై పాలకులకు కనీస దృష్టి లేదన్నారు. ధరణి వెబ్సైట్లో గత 15 నెలలుగా నెలకొన్న వందల సంఖ్యలోని సమస్యలను నేటి వరకు పరిష్కరించలేదన్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లకు బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో 10 శాతమైన ఆయా వర్గాలకు ఖర్చు చేశారా అని ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల కోట్లు, నాలుగు లక్షల కోట్లు అని గొప్పలు చెప్పుకోవటానికి తప్ప తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. కరోనా కారణం వల్ల రుణమాఫీ చేయలేకపోయామని చెబుతున్న పాలకులు గొప్పలు కోసం ఒక సచివాలయం ఉన్నా మరో సచివాలయాన్ని వందల కోట్లతో నిర్మిస్తున్నారని విమర్శించారు. సీతారామ ప్రాజెక్టుకు అనుసంధానమైన రోల్లపాడు ప్రాజెక్టు కోసం 2016 ఫిబ్రవరి నెలలో శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు వ్యయం 19 వేల కోట్ల రూపాయలు కాగా గడిచిన ఏడేళ్లలో నాబార్డ్ నుంచి 6, 000 కోట్ల రూపాయలు తెచ్చి పనులు చేశారని వివరించారు. ఈ లెక్కల ప్రకారం రాబోయే 15 సంవత్సరాల కైనా రోల్లపాడు నిర్మించి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల కాళ్లు గోదావరి జలాలతో కడుగుతారా అంటూ ఎద్దేవా చేశారు. తనకు కల్లూరు మండలంలో 40 ఎకరాల మామిడి తోట ఉందని, ఆ తోటకి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని విమర్శలు చేసే నాయకులకు కౌంటర్ ఇచ్చారు. తనకు కల్లూరు మండలంలో 20 ఎకరాల మామిడి తోట మాత్రమే ఉందని స్పష్టం చేశారు. తన ఆస్తులపై జనవరి రెండో తేదీన రెవెన్యూ అధికారులతో విచారణ చేయించిన అధికార పక్షానికి తనకి ఎంత పొలం ఉందో తెలియదా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వానికి గత నెల రోజులుగా విద్యుత్ సరఫరా లేక రైతులు పడుతున్న ఆవేదన తెలియదా అని ప్రశ్నించారు. విద్యుత్ కోసం రాష్ట్రవ్యాప్తంగా రైతులు ధర్నా చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యుత్ సమస్య గురించి తెలిసినా ప్రభుత్వం మేకపోతు గాంభీర్యంతో నిజాలను నిజంగా ఒప్పుకోవట్లేదని విమర్శించారు. రాష్ట్రంలో సామాన్య ప్రజానీకానికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాంటి వైద్యం అందుతుందో పాలకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. గొప్పల కోసం నామస్మరణ కోసం పాకులాడుతున్న పాలకులు తప్పదని హెచ్చరించారు. వైరా నియోజకవర్గంలో తనకు అవినాభావ సంబంధం ఉందని చెప్పారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కంటే వైరా నియోజకవర్గ ప్రజలు తనకు మరింత అండదండలుగా ఉన్నారన్నారు. వైరా నియోజకవర్గంలోని వందలాది మంది ప్రజా ప్రతిప్రనిధులు సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా శీనన్న గూటికి చేరతారని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాప్రతినిధులకు తాను భరోసా ఇచ్చానని పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నియోజకవర్గం నుంచి విజయభాయి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటుందని శీనన్న చెల్లెలిగా ఆశీర్వదించి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బానోత్ విజయభాయి, డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయబాబు, మద్దినేని బేబి స్వర్ణకుమారి, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, వైరా మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, వైరా నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, పొంగులేటి అనుచరులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: