Sunday, 26 July 2026 11:25:29 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సూరయ్య బంజర్ తండా లో కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం...

Date : 19 September 2022 12:15 AM Views : 608

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : రాష్ట్రంలో గిరిజనులు రిజర్వేషన్లు 10 శాతం పెంచుతున్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించ డం పై హర్షం.... సత్తుపల్లి నియోజకవర్గంలోని పెనుబల్లి మండలం, సూరయ్య బంజార తండా గ్రామంలో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో గిరిజనుల సమక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పూలు, పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ గిరిజన రిజర్వేషన్లు శాతం పెంచడం, వారం రోజుల్లోనే జీవోను విడుదల చేసే విధంగా కసరత్తు చేయడం హర్షించదగ్గ విషయం అని అన్నారు. గూడేలను , తండాలను గ్రామపంచాయతీలుగా చేయాలని, మా యొక్క గ్రామాన్ని, మేమే పాలిస్తామని, స్వయం పాలన కావాలని చెప్పి, ఎన్నో సంవత్సరాలుగా నినాదించిన ఆదివాసి, లంబాడి సోదరులకు ఒక ప్రత్యేకమైన స్థానం ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిందన్నారు. సూరయ్య బంజరగ్రామంలో నూతనంగా లబ్ధిదారులకు మంజూరైన ఆసరా పింఛన్ లబ్ధిదారులకు ఆసరా పింఛన్ గుర్తింపు కార్డులను, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ , సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేయగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారికి ముందుగా గ్రామ ప్రజలు గ్రామ శివారు నుండి మేల తాళాలతో పూలతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని గిరిజనులు అంతా కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రపటానికి పూలు పాలభిషేకాలు నిర్వహించి, అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గ్రామంలో మంజూరు అయిన నూతన ఆసరా పింఛన్ లబ్ధిదారులకు గుర్తింపు కార్డులను, కల్యాణలష్మి , షాదీ ముబారక్ చెక్కులను, చెక్కులతో పాటు పెళ్లి కానుకగా సొంత ఖర్చులతో చీరను బహుకరణగా అందజేసి, తమ సిఫారసు మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధులను మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు... ఈ కార్యక్రమంలో గ్రామాల సర్పం చ్.ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :