సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, రాష్ట్ర నాయకులు ఆళ్ల మురళి, తూము చౌదరి అన్నారు. కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా లక్ష్మిదేవిపల్లిలోని ప్రశాంత్ నగర్ పంచాయతీలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు గత ఎన్నికల సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసగిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు 12 లక్షల రూపాయల దళిత బంధు, రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ, 500 రూపాయలకే గ్యాస్ బండ, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, రెండు లక్షల ఉద్యోగాలను తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు భావ్ సింగ్,ఉప్పల హేమంత్,మల్లేష్, సీతయ్య, సుందర్ లాల్ కోరి, కనకరాజు, చిమట నాగేశ్వరావు, మైనార్టీ నాయకులు గౌస్, అయూబ్ ఖాన్, నరేష్, సత్యనారాయణ రెడ్డి, కుమార్, ఉదయ్ కుమార్, శేఖర్, దుర్గరాశి సతీష్, సంపత్,మహేష్, మహిళా నాయకురాళ్ళు పుష్ప, లైలా, సరిత, సరోజినీ, నాగమ్మ , మహిళా కార్యకర్తలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
-----------------------
Admin