సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణ భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయం నందు జరిగిన సమావేశంలో భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు అనుబంధం మండల ప్రధాన కార్యదర్శి షేక్ ముస్తఫా మాట్లాడుతూ డబల్ బెడ్ రూమ్ ఇల్లులు మోటార్ సైకిల్ లను భవన నిర్మాణ కార్మికులకు ఇస్తామని హామీ ఇచ్చి నేటికీ అమలు చేయడంలో విఫల మవుతున్న రాష్ట్ర ప్రభుత్వం మరో సంక్షేమం పథకాలకు తరతిస్తుందని వారు అన్నారు.నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు నూతన సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ నిధులను ఖర్చు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుందని హామీలకే పరిమితమవుతున్నారని తక్షణమే అర్హులైన ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రతి కార్మికుడికి తక్షణమే మంజూరు చేయాలని ప్రమాదంలో మరణించిన కార్మికునికి 10 లక్షల రూపాయలు సహజ మరణానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే అర్హులైన ప్రతి ఒక్కరూ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసుకుని హుజూర్ నగర్ లోని ఆర్డీవో కార్యాలయం ముందు మూడో తారీకు జరగబోయే ధర్నాలో కార్మికుల అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలక సోమయ్య గౌడ్ పట్టణ అధ్యక్షులు శీలం వేణు పట్టణ ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి వెంకన్న. కోశాధికారి కంచుపాటి రాంబాబు సాయి అక్బర్ అంజి అశోకు శ్రీను వీరబాబు నాగమ్మ సూర్యనారాయణ చారి సైదులు పెండెం నరేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
-----------------------
Admin