సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుళదేవరచెరువు మండల కేంద్రానికి సమీపంలో ఎం. కొత్తపల్లి బండపై వెలసిన శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి ఆలయం ఆవరణలో విద్యాగణపతి సన్నిధిలో (బుధవారం) చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సోమవారం పచ్చార్ల ఆంజనేయులు నాయుడు పేర్కొంటూ..ఎస్ఐ కే.గోపీతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొనాలని ఆహ్వాన పత్రిక అందచేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.... అయ్యప్పస్వామి ఆలయంలో బుధవారం ఉదయం 7:30 గంటల నుండి 10 గంటల వరకు పురోహిత పండితుల సమక్షంలో దాత కోడూరు శ్రీకాంత్ సహాయ సహకారాలతో నిర్వహించే అక్షరాబ్యాసం కార్యక్రమంలో 4 నుండి 6 ఏళ్ళ చిన్నారులతో పాటు వారు తల్లిదండ్రులు హాజరై విజయవంతం చేయాలని అయన కోరారు
-----------------------
Admin