సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : అంగన్వాడీ సంఘాలకు icds మంత్రి గారు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలి* అంగన్వాడి జిల్లా కార్యదర్శి జి పద్మ డిమాండ్ చేశారు తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ (యూనియన్) అంగన్వాడీ జిల్లా కమిటీ సమావేశం వెంకటమ్మ అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా కార్యదర్శి జి పద్మ మాట్లాడుతూ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పైన పునరాలోచించాలి. లేదంటే పోరాటాలను ఉదృతం చేస్తాము. నిన్న తేదీ:25.8.2023 న రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు ఒక లక్ష, హెల్పర్ల కు 50 వేలు, ఆసరా పెన్షన్, మినీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా మారుస్తామని ప్రకటించింది. ఇందులో రిటైర్మెంట్ బెనిఫిట్స్ పైన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాము మినీ సెంటర్స్ ను మెయిన్ సెంటర్స్ గా మార్చడాన్ని స్వాగతిస్తున్నాము వెంటనే సర్కులర్ ఇవ్వాలి . ఇది ఆగస్టు 18న అంగన్వాడి సంఘాలతో జరిగిన జాయింట్ మీటింగ్ లో మంత్రి గారు చెప్పిన అంశాలకు పూర్తిగా భిన్నంగా ఉంది. ఆగస్టు 18న జరిగిన సమావేశంలో టీచర్లకు రెండు లక్షలు, హెల్పర్లకు లక్ష ఇస్తామని స్వయంగా మంత్రిగారే చెప్పారు. అంతేకాదు 30% పిఆర్సి వేతనాలు పెంచుతామని మట్టి ఖర్చులు ఇస్తామని చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ఏదైనా ఒక యాప్ ఉండేలా చూస్తామని ఇన్సూరెన్స్ సౌకర్యం రెండు లక్షల వరకు ఇస్తామని ఇవన్నీ మంత్రిగారు స్వయాన చెప్పారు నిన్న ఆ అంశాలకు భిన్నంగా ప్రభుత్వం ప్రకటన చేయడం అత్యంత దుర్మార్గం. ఈ నిర్ణయాన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలి. ఇచ్చిన హామీ ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను పెంచాలి. ఆగస్టు 18న ఇచ్చిన ఇతర హామీలను కూడా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. పర్మినెంట్ చేయాలి ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించారు కనీస వేతన 26,000 పెరిగిన ధరలకు జీతాలు పెంచాలి రిటైర్మెంట్ టీచర్స్ రూ. 10.00.000 ఇవ్వాలి మినీ టిచర్స్ హెల్పర్స్ రూ.500000 లక్షలు రిటర్మెంట్ సౌకర్యం ఇవ్వాలని వాస్తున్నా జీవితంలో సగం పెన్షన్ చనిపోయిన వారికి మట్టి ఖర్చులు 50 వేలు ఇవ్వాలని వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని హెల్త్ కార్డులు ఇవ్వాలని ఈఎస్ఐపిఎఫ్ కల్పించాలని లేదంటే మా పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ అధ్యక్షులు సహాయ కార్యదర్శి లు మరియా కృష్ణవేణి సావిత్రి ఫాతి మా శ్రీదేవి వెంకటరమణ భవాని తిరుపతమ్మ సుమలత తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin