సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ఇల్లందు స్థానిక సింగరేణి పాఠశాల నందు గత నెల 23న జరిగిన సంఘటన నిమిత్తం ఘటనకు కారణమైన ఉపాధ్యాయుని పై చర్యలు తీసుకోవాలని కొత్తగూడెం ఎడ్యుకేషనల్ జి యమ్, కార్యాలయం నందు కరస్పాండెంట్ నికోలాస్ ని గురువారం ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్ కే ఫహీమ్ దాదా, ఎస్.ఎఫ్.ఐ జిల్లా ఉపాధ్యక్షుడు అభిమన్యు, పిడిఎస్ యు జిల్లా అధ్యక్షుడు సాంబ లు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుని విధుల నుంచి తొలగించాలని,అతని ట్రాన్స్ఫర్ నిమిత్తం గోలేటి కి పంపించడం సరికాదని వెంటనే విధుల నుంచి తొలగించాలని విద్యార్ధి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. కరస్పాండెంట్ నికోలస్ స్పందిస్తూ వారం రోజుల్లో నిజా నిజాలు తెలుసుకొని అతనిపై ఎంక్వయిరీ నిర్వహించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు విద్యార్థి సంఘాలకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్, పిడిఎస్యు రాష్ట్ర సమితి సభ్యులు మంజుల సాంబ, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి రామకృష్ణ, పిడిఎస్యు జిల్లా కోశాధికారి గణేష్ పాల్గొన్నారు
-----------------------
Admin