సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట నియోజకవర్గం,నర్సంపేట మండలం,ఇప్పల్ తండాకి చెందిన యువకులు బానోత్ సాగర్,బానోత్ నూతన్,ధరావత్ అనిల్,పితావత్ సునీల్,అజ్మీరా రాజుకుమార్,జాటోత్ నవీన్,ధరావత్ అఖిల్,ధరావత్ జగన్,బానోత్ లోకేష్,ధరావత్ సంజు,జాటోత్ సుమన్,బానోత్ ఈశ్వర్ గార్లు మండల ప్రధాన కార్యదర్శి తాళ్లపెల్లి రాము,సొనబోయిన సిద్దు గార్ల ఆధ్వర్యంలో,మండల అధ్యక్షులు తనుగుల అంబేద్కర్ గారి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారి సమక్ష్యంలో బిజెపి పార్టీలో చేరారు….ఈ సందర్భంగా రాణా ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతూ…. బిజెపి దేశంలో సాధిస్తున్న పురోగతి,జాతీయవాద సిద్ధాంతం నచ్చి,ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి ఆకర్షితులై,పేద - బడుగు-బలహీన వర్గాల కోసం అయన చేస్తున్న సేవను,తెలంగాణ రాష్ట్రంలో మోదీ గారిపై, బిజెపి పై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను గుర్తించి పార్టీలోకి విచ్చేస్తున్నారు..తెలంగాణలోని గ్రామ పంచాయితీలకు,ఎంపీటీసీ, జడ్పిటీసీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పడకేసింది,ఓడిపోతామన్న భయంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి వెనకడుగు వేస్తుంది.కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా,ఎదుర్కోవడానికి బిజెపి సిద్ధంగా ఉందని ,యువకులను రాజకీయంగా ముందుకు తీసుకెళ్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రాంచందర్ రెడ్డి గారు,జిల్లా కౌన్సిల్ మెంబర్ గంగిడి మహేందర్ రెడ్డి గారు,మండల ఉపాధ్యక్షులు బోయిని సుధాకర్,నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ ఆముదాల రమేష్ ,BJYM జిల్లా కార్యదర్శి ఎర్ర రాజు,BJYM జిల్లా కార్యవర్గ సభ్యులు పురాణీ దేవేందర్,సుమన్,లక్ష్మణ్ మరియు తదితరులు పాల్గొన్నార నర్సంపేట మండలం సర్కార్ టీవీ రిపోర్టర్ కుమారస్వామి
-----------------------
Admin