సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద విద్యార్థుల ర్యాలీ ఉద్రిక్తత లకు దారి తీసింది. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ కొత్తగూడెం నుండి కలెక్టరేట్ వరకు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యం లో ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్ వద్ద పోలీసులు అడ్డుకోవటం తో ఇరువర్గాల మధ్య తోపులాట కొనసాగి స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకున్నది. విద్యార్థులు కలెక్టరేట్ గేట్ ఎక్కి నిరసన తెలిపారు. డిమాండ్ ల పరిష్కారం కోరుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భముగా ఎస్ ఎఫ్ ఐ నాయకులు మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాల కోసం నిధులు కేటాయించి న ప్రభుత్వం విద్యార్థుల గత విద్యా సంవత్సరం పెండింగ్ స్కాలర్ షిప్ లు మంజూరు చేయకపోవటం విచారకరం అన్నారు. 2016 నుండి మెస్ చార్జీలు పెంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహిస్తున్నారని విమర్శించారు. గురుకులాలు ప్రారంభించిన ప్రభుత్వం పక్కా భవనాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.
-----------------------
Admin