సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ 6 గ్యారెంటీ పథకాల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. పార్టీ ఇందుకోసం అగ్రనేతలందరూ కలిసికట్టుగా శుక్రవారం పాల్వంచ జగన్నాధపురంలో ఉన్న పెద్దమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం చెపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు మహిళలకు ప్రతీ నెల రూ.2,500, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500కు గ్యాస్ సిలిండర్, రైతులకు ఏటా రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, పంటకు రూ.500 బోనస్, ప్రతీ కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇళ్లు లేనివారికి ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షల సాయం, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామని వివరిస్తున్నారు. నెలకు రూ.4 వేల పింఛన్, రూ.10 లక్షల ఆరోగ్యబీమా, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతీ మండలంలో ఇంటర్నేషనల్ స్కూళ్లు నెలకొల్పుతామని చెబుతున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని, ఈసారి తమకు అధికారం ఇస్తే తప్పనిసరిగా హామీలను అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు జాలె జానకి రెడ్డి, పాల్వంచ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు, బ్లాక్ అద్యక్షులు వీరయ్య చౌదరి, మైనార్టీ పట్టణ అధ్యక్షులు చాంద్ పాషా, బీసీ నాయకులు వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, స్థానిక నాయకులు దేవేందర్, శ్రీను, కిషన్, రామా, మైనార్టీ నాయకులు గౌస్ భాయ్, అయూబ్ ఖాన్, సత్యనారాయణ, సతీష్, రాజు, మహేష్, నవీన్, వెంకటేశ్వరరెడ్డి , రామారావు, శ్రీశైలం, నాగేశ్వరరావు, నిరంజన్ రెడ్డి, శ్యామ్, నరేష్, పండు, ప్రవీణ్, కాంగ్రెస్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin