సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ: నేటి నుంచి బీఎస్పీ ఆధ్వర్యంలో మన కొత్తగూడెం...మన కామేష్ కార్యక్రమం ప్రారంభం..రానున్న ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటి చేస్తున్న యెర్రా కామేష్ విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు..తొలుత పాల్వంచ పెద్దమ్మ గుడిలో పూజలు నిర్వహించిన అనంతరం ఇంటింటికీ తిరిగి ప్రజలను కలుసుకుని బీఎస్పీ పార్టీ గెలుపు అవశ్యకతను వివరిస్తారు...ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,ఎమ్మెల్యే అభ్యర్థి యెర్రా కామేష్ ఆదివారం పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే 50 రోజులు అత్యంత కీలకమైనవి అని నాయకులు కార్యకర్తలు కష్టపడి పని చేస్తే విజయం సాధించడం సులభమని ఉద్బోధించారు..ప్రజలు కూడా స్థానికులకే ప్రాధాన్యత ఇస్తారని,కేవలం ఎన్నికల సమయంలో వచ్చే పొలిటికల్ టూరిస్ట్ లను నమ్మరని గుర్తు చేశారు...గత 5 ఏళ్లుగా ప్రజా సమస్యలపై పోరాటం చేసిన ఏకైక పార్టీ బీఎస్పీ మాత్రమే అని ఖచ్చితంగా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.. పాల్వంచ పట్టణ అధ్యక్షుడు కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అసెంబ్లీ మహిళా అధ్యక్షురాలు కేతీని కుమారి,మండల అధ్యక్షురాలు కాటబొయిన వసుంధర,యర్రంశెట్టి రాజేశ్వరీ,మంజు,పద్మ,భానుమతి తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin