సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలో మహాత్మా గాంధీ 75వ వర్ధంతిని పురస్కరించుకొని ఓబుల దేవర చెరువు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యధికారి డిప్యూటీ డి ఎం & హెచ్ ఓ డాక్టర్ ఐనుద్దీన్ మరియు డాక్టర్ భానుప్రకాష్ ఆధ్వర్యంలో స్పర్శ కుష్ఠు వ్యాధి అవగాహన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమం ప్రతి గ్రామములో ఆశలు, ఏఎన్ఎం ప్రతి ఇంటికి వెళ్లి సర్వే నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం గురించి అవగాహన కల్పించి, అనుమానితులను గుర్తించి వైద్యాధికారుల వద్దకు పంపి పరీక్షలు చేయంచబడును. ఈ ప్రోగ్రాం జనవరి 30వ తేది నుండి13 ఫిబ్రవరి 2023వరకు జరుగును అని తెలియజేసారు. ఈ కార్యక్రమం నందు నోడల్ ఆఫీసర్ బి. లాలేనాయక్ ఎం పి హెచ్ ఈ ఓ. మరియు పి హెచ్ ఎన్ దిల్షాద్ , పర్యవేక్షకులు, ఆరోగ్య సిబ్బంది, సిహెచ్ ఓ లు ఆశ సిబ్బంది హాజరైనారు...
-----------------------
Admin