సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు :కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందని పాలకవీడు ఎంపీపీ భూక్యా గోపాల్ నాయక్ అన్నారు. పాలకవీడు మండలం, గుడుగుంట్లపాలెం గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి జెడ్పిటిసి మాలోతు బుజ్జి మోతిలాల్ నాయక్ తో కలసి శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడారు. జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు రూ 5 లక్షలు మంజూరి చేయగా నేడు పనులు ప్రారంభించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు అర్హులందరికీ వంద రోజుల్లో అమలు చేయడం ఖాయమన్నారు. ఇందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ విజయవంతంగా అమలవుతుందన్నారు. రూ500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని త్వరితగతిన అమలు చేసేందుకు కసరత్తు లు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ దొంగల వెంకటయ్య, జిల్లా కాంగ్రెస్ బైరెడ్డి జితేందర్ రెడ్డి, మాలోథ్ మోతిలాల్ నాయక్,మండల ప్రధాన కార్యదర్శి నీమానాయక్, మండల యూత్ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి , ఎంపీఓ దయాకర్, మాజీ సర్పంచులు బూశిపల్లి వెంకటరెడ్డి, నర్సిరెడ్డి, నాయకులురామాంజ రెడ్డి, భాస్కర్ రెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి కృష్ణ ,కిరణ్ తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin