సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఉమ్మడి అనంతపురం జిల్లా కేంద్రంలో నెహ్రూ మున్సిపల్ పాఠశాల సమీపంలో ఆంధ్రప్రదేశ్ సిపియస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం రోజున పాత పెన్షన్ సాధనకై ప్రతి ఘటన ధర్నా మద్దతు గా సంఘీభావ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు & జిల్లా ఫ్యాప్టో కార్యవర్గ సభ్యులు గౌస్ లాజమ్ పాల్గొన్నారు అని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపియస్ రద్దు జిపియస్ వద్దు అని,పాత పెన్షన్ సాధనకై అని సంఘాలు కలిసి ఐక్య ఉద్యమాలతో పాత పెన్షన్ సాధనకై కృషి చేయాలని కోరారు అని మండల అధ్యక్షులు సోమశేఖర్ నాయక్, వెంకట చలమయ్య నరసింహులు ఒక ప్రకటనలో తెలిపారు
-----------------------
Admin