సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు : రాష్ట్ర ప్రభుత్వం స్వంత పక్కగృహం లేని అర్హులకు గృహనిర్మాణం కొరకు రూ మూడు లక్షలు సహాయం చేయడానికి తీసుకొచ్చిన గృహలక్ష్మి పథకంకు దరఖాస్తు చేసుకునే గడువు పొడిగించాలని ఎంపిటిసిల ఫోరమ్ మండల అధ్యక్షులు మీసాల ఉపేందర్ ప్రభుత్వాన్ని కోరారు.శుక్రవారం నాడు ఆయన తహసిల్దార్ వి.శ్రీదేవి కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆగస్ట్ 12 వరకు గడువు ఇవ్వడం వలన చాలా మంది అర్హులైన వారు,వలసలు వెళ్ళినవారు దరఖాస్తు చేసుకోలేక పోతున్నారని,12తేదీన రెండవ శనివారం సెలవు దినం కావడంతో దరఖాస్తులు స్వీకరించేలా ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేయగా రేపు సెలవు ఐనా గాని కార్యాలయ సిబ్బంది గృహలక్ష్మి దరఖాస్తులు తీసుకుంటారని తహసిల్దార్ తెలిపారు.అర్హులు ఎవరైనా దరఖాస్తు చేయాలనుకుంటే శనివారం నాడు తహసిల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.
-----------------------
Admin