Monday, 27 July 2026 01:32:37 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జాతీయ పార్టీగా BRS (భారతీయ రాష్ట్ర సమితి) గా అవతరించడం పట్ల సంబరాలు ....

Date : 05 October 2022 06:27 PM Views : 657

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : టిఆర్ఎస్. జాతీయ పార్టీగా BRS (భారతీయ రాష్ట్ర సమితి) గా అవతరించడం పట్ల సంబరాలు చేసిన కల్లూరు టిఆర్ఎస్ శ్రేణులు... తెలంగాణ లో అభివృద్ధిని దేశవ్యాప్తం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం : నాయకులు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం లోనికల్లూరు లో బాణాసంచ కాల్చి, స్వీట్స్ పంచి సంబరాలు చేసిన :తెరాస శ్రేణులు ........................ హైదరాబాద్ తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్‌ఎస్‌ పార్టీ సర్వసభ్య సమావేశంలో...నవశకానికి నాంది పలుకుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన దేశ రాజకీయాల్లోకి అడుగెడుతూ ఏకగ్రీవ తీర్మానంతో తెలంగాణ రాష్ట్ర సమితిని ఇకపై భారత్ రాష్ట్ర సమితి (BRS) గా నామకరణం చేస్తూ, బిఆర్ఎస్ ను జాతీయ పార్టీగా సీఎం కేసీఆర్ ప్రకటించగా హర్షం వ్యక్తం చేస్తూ... ఎమ్మేల్యే సండ్ర వెంకట వీరయ్య నాయకత్వoలో, కల్లూరు టిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యలో... పార్టీ శ్రేణులు మెయిన్ సెంటర్ లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద టపాసులు కాల్చి, స్వీట్స్ పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భoగా నాయకులు మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ ది.ఉక్కు సంకల్పమని విజయ దశమి నాడు జాతీయపార్టీ పేరు ప్రకటించడం హర్షనీయం అన్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమ తొలినాళ్లలో ఎన్నో అవరోధాలు, సవాళ్ళను అధిగమించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని, ఈనాడు కేంద్రం లో ఉన్న బిజెపి ప్రభుత్వం వైఖరితో వేసారి, తెలంగాణ వంటి రాష్ట్రాలపై ఆర్థిక వివక్ష చూపిస్తూ.. రాష్ట్ర అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటుదని, కేంద్ర బిజెపి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రాలపై కేంద్రం ఆధిపత్య దోరణినీ తొలగించి, స్వతంత్ర్య ప్రతిపత్తిగల రాష్ట్రాలుగా అవతరించాలనే లక్ష్యంతో ఉద్యమ నేత సీఎం కేసీఆర్ ఉక్కు సంకల్పంతో జాతీయ పార్టీని బి. ఆర్ ఎస్. ను స్థాపించారనీ అన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశవ్యాప్తo కావాలని యావత్ దేశ ప్రజలు కోరుకుంటున్నారని, ఆ దిశగా సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి అడుగిడుతున్న సందర్భాన్ని హర్షి స్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్ కు మద్దతుగా అండగా నిలవాలని కాంక్షించారు. దేశ రాజకీయాలు తెలంగాణ చుట్టూ తిరిగేలా చేసే సంకల్పం, విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ ని విజయ దశమి నాడు ప్రారంబించిన బి ఆర్ ఎస్ జాతీయ పార్టీ అనతికాలంలోనే కేంద్రం లో చక్రం తిప్పడం కాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో రై.స.స. ప్రతినిధులు డాక్టర్ లక్కినేని రఘు పసుమర్తి చంద్రరావు జడ్పీ మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి ఇస్మాయిల్ కమ్లి టిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు పెడకంటి రామకృష్ణ టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కొరకు ప్రసాద్, ఏఎంసి డైెరెక్టర్ కట్టా అర్లప్ప, సర్పంచులు గంగవరపు శ్రీనివాసరావు తడికమళ్ళ యశోద సామెల్ ఎంపీటీసీ కొర్రా రుక్మిణి నరసింహారావు, నాయకులు సరాబు వెంకటేశ్వరరావు, మండల మహిళా విభాగం అధ్యక్షురాలు భూక్యా జ్యోతి రాము, నాయకులు అజ్మీరా జమలయ్య, ఖమ్మంపాటీ రమేష్, తల్లపురెడ్డి అనిమి రెడ్డి, పాలడుగు శంకర్ రావు, బొగ్గుల రామిరెడ్డి, ఐలూరి నాగిరెడ్డి, మంచాల కృష్ణ , భాణోత్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :