సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ దుగ్గొండి,( డి కుమార్ రిపోర్టర్),,,@ నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం,రాజ్యా తండా ,గోబ్రియా తండా గ్రామానికి చెందిన బి ఆర్ఎస్ పార్టీ నాయకులు బానోత్ రమేష్ ,లావుడ్యా రెబల్ గార్లు, ఎస్టిమోర్చా జిల్లా నాయకులు బానోత్ రమేష్ నాయక్ మరియు బానోత్ వీరభద్రు గార్ల ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు.ఈసందర్బంగా రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ...గ్రామాల అభివృద్ధి బీజేపీ పార్టీతోనే సాధ్యమని ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు.రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్,ప్రధాన కార్యదర్శులు కందికొండ శ్రీనివాస్,సూత్రపు సరిత,ఉపాధ్యక్షులు ఠాకూర్ విజయ్ సింగ్,కాసుల నాగేంద్ర బాబు,జూలూరి మనీష్ మరియు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Reporter