సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్ని మతాలు ఏ ఒక్కరికి హాని తలపెట్టకుండా జీవించాలని, జిల్లా కలెక్టర్ అనుదీప్ పేర్కొన్నారు. ఆదివారం కొత్తగూడెం పట్టణంలోని రామా టాకీస్ ఏరియా మజీద్ లో ఏర్పాటు చేసిన విఫ్తార్ విందులో ఆయన పాల్గొని నమాజ్ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజులు పాటు ముస్లింలు కఠోరమైన ఉపవాసాలు పాటిస్తారని చెప్పారు. ప్రతి ఒక్కరు ఉపవాసాలు పాటించి ఆకలి అంటే ఏమిటో అనుభవ పూర్వకంగా తెలుసుకుని సమాజం లోని బీదసాదల పట్ల సానుభూతి వహించడం నిజంగా హర్షనీయమని చెప్పారు. సృష్టి కర్త అయిన దేవుడు ఒక్కడే. మానవులందరు ఆయన దాసులే. కనుక మనమంతా పరస్పరం సోదర భావంతో సత్యం, న్యాయం,ధర్మం తప్పకు పాటిస్తూ మంచి పనులు, దానధర్మములు చేస్తూ సహనశీలునిగా సమాజం హితం కోరే వారిగా మలిచే ఉపవాసాలు పాటిం చాలని చెప్పారు. స్వచ్చందంగా జకాత్ చెల్లించడం కూడా సమాజం లోని బీదసాదల అవసరాలు తీర్చడానికి ఖర్చు చేయడం కూడా చాలా అవసరమని చెప్పారు. ఈ సందర్భంగా మీరందరూ సత్ సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని, కులమతాలకు అతీతంగా అన్నదమ్ముల లా జీవించాలి అని ఆకాంక్షించారు. కుటుంబం అన్ని వేళలా ఆరోగ్యంగా, ఆనందంగా సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పారు. చిన్నతనంలో తన మిత్రులతో కలిసి మజీద్ కు వెళ్ళేవాడినని, ఈ పవిత్ర మాసంలో అలనాటి అనుభూతులు మరచి పోలేనివని చెప్పారు. రంజాన్ పండుగ రోజున మిత్రులతో కలిసి సేమ్యా, పాయసాలు ఎంతో ఇష్టంగా తేనే వాడినని ఆయన గుర్తు కలెక్టర్ గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి సంజీవరావు, బ్రదర్ సిరాజ్, ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు....
-----------------------
Admin