సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచలం పట్టణంలో గతంలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి ప్రభుత్వ భూములను గుర్తించి బోర్డులను ఏర్పాటు చేసినారు అట్టి బోర్డులను తొలగించి వలస గిరిజనేతరులు భూమిని కబ్జా చేసి ఎల్ టి ఆర్ చట్టానికి విరుద్ధంగా అక్రమ భవనాలను నిర్మిస్తున్నారు. అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా అమాయక నిరుపేద ఆదివాసీ లు ఏర్పాటు చేసుకున్న గుడిసెలను తొలగించాలని స్థానిక తసీల్దార్ హుకుం జారీ చేయడం ఎంతవరకు సమంజసం?ఏజెన్సీ లో సేటిల్ మెంట్ పట్టాలు లేకుండా రెవిన్యూ పట్టాలు ఏవిధంగా వచ్చాయో పూర్తిగా విచారణ జరిపి వాటిని రద్దుచేయాలి, ఇక్కడ రెవిన్యూ అధికారులు ఏజెన్సీ చట్టాలను పటిష్టంగా అమలు చేయకుండా గిరిజనేతరులకు కొమ్ము కాస్తూ వారి పక్షాన మాట్లాడడం తగదు,అని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ ఈ సందర్భంగా తెలిపారు ముందుగా భద్రాచలం పట్టణంలో రెవెన్యూ భూములను ఆక్రమించిన గిరిజ నేతరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అంతే కాని అమాయక ఆదివాసీల ప్రజలపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించడం మంచిది కాదని రెవిన్యూ భూమి కబ్జాదారులపై దృష్టి సారిస్తే మంచిదని అమాయకమైన ఆదివాసి బిడ్డలకు న్యాయం చేకూరుతుందని ఈ సందర్భంగా తెలియ పరిచారు ఈ యొక్క కార్యక్రమంలో వంక వరాల బాబు గడ్డం వెంకన్న బాబు మడకం చిట్టెమ్మ సోడి సీతమ్మ తదితర ఆదివాసి కార్యకర్తలు పాల్గొన్నారు...
-----------------------
Admin