సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు : గిరిజన గ్రామాల రైతుల చిరకాల వాంఛ నెరవేర్చేందుకు మంత్రి ఉత్తమ్ అభయ హస్తం అందించారు.2040 ఎకరాల టేలాండ్ భూములకు సాగునీరందించేందుకు బెట్టె తండా లిఫ్టు నిర్మాణానికి 33.83 కోట్ల రూపాయలు నిధులు మంజూరీ చేయించారు.అంతేకాకుండా ఈ ప్రాంతాల అభివృద్ధికి మరిన్ని వరాల జల్లులు కురిపించారు.పాలకవీడు మండలంలోని బెట్టేతండా సజ్జాపురం,పాడియాతండా ప్రాంతాల్లోని గిరిజన రైతుల భూములు సస్యశ్యామలం కానున్నాయి.నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని ఆర్ 12 మైనర్ కాల్వ ద్వారా సాగునీరు అందుతున్నప్పటికీ టేలాండ్ భూములు కావడంతో సాగు నీరు సరిగా సరఫరా కాక పంటలు ఎండిపోతున్నాయి. ఈపరిస్థితినిఅధిగమించేందుకు ఈ గ్రామాల తలాపునే ఉన్న మూసీ నదిపై లిఫ్ట్ నిర్మించి సాగునీరందించాలని పాలకవీడు జెడ్పిటిసి మాలోతు బుజ్జి మోతిలాల్ నాయక్ ఎన్నో ఏళ్లుగా చేస్తున్న ప్రయత్నం ఫలించింది.ఆదివారం బెట్టే తండా గ్రామంలో గిరిజన రైతుల ఆధ్వర్యంలో సంబరాలు అంబరాన్నంటాయి. జెడ్పిటిసి నేతృత్వంలో మంత్రి ఉత్తమ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా జెడ్పిటిసి మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ చెప్పింది చేస్తాడని చేసేదే చెబుతాడని , గిరిజన ప్రాంత ప్రజల సంక్షేమం కొరకు మంత్రి ఉత్తమ్ చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. ఇటీవల శాసనసభ కు జరిగిన ఎన్నికలలో మంత్రి ఉత్తమ్ దృష్టికి సమస్య తీవ్రతను తీసుకువెళ్లగా తక్షణమే హామీ ఇచ్చారు. ఈ మేరకు లిఫ్ట్ నిర్మాణానికి ఇటీవల ఉన్నతాధికారులచే ప్రతిపాదనలు తయారు చేయించి నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.ఈ లిఫ్ట్ తో పాటు నీటి నిల్వ కొరకు చెక్ డాం నిర్మించాలని,గత ప్రభుత్వ హయాంలో మూడున్నర కోట్లతో బెట్టే తండా,శూన్యపాడు రహదారి నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైందని వీటి రోడ్డు నిర్మించాలని కోరిన వెంటనే ప్రతిపాదనలు తయారుచేసి పంపాలని అధికారులను ఆదేశించారని త్వరలో నిధులు మంజూరీ చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇదేవిధంగా మూసోడ్డు సింగారం, ఎల్లాపురం గ్రామాలలో సాగునీటి లభ్యత కొరకు లిఫ్ట్ లు మంజూరి చేయాలని మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఇటీవల జరిగిన జాన్ పహాడ్ ఉర్సు ఉత్సవాలకు హాజరైన మంత్రి కృష్ణ పరివాహక గ్రామాలన్నీ మంచినీటి ఎద్దడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణ పరిష్కారంగా కృష్ణా నది నుండి జాన్ పహాడ్ వరకు పైప్ లైన్ ద్వారా నీటిని రప్పించి ఫిల్టర్ చేసి మహంకాళిగూడెం,జాన్ పహాడ్ దర్గా, కల్మెట తండా, శూన్య పాడు, కొత్త తండా, చెరువు తండ కోమటికుంట, పాడియా తండా, బెట్టేతండా, సజ్జాపురం గ్రామాలకు మంచినీటిని సరఫరా జరిగేలా అధికారులు ప్రతిపాదనలు పంపితే వెంటనే నిధులు మంజూరు చేయిస్తానన్నారు. గత బిఆర్ఎస్ పాలనలో గిరిజన ప్రాంతాలు అన్ని రంగాలలో వెనుకబాటుకు గురయ్యాయని మంత్రి ఉత్తమ్ అందజేస్తున్న సహకారం మరువలేదని గిరిజన ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. కార్యక్రమంలోజిల్లా కాంగ్రెస్ నాయకులు మాలోథ్ మోతిలాల్ నాయక్,కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నీమానాయక్ నాయకులు ,బాండావత్ శివాజీ నాయక్ , బాండావత్ శ్రీను నాయక్,గ్రామశాఖ అధ్యక్షులు బాండవత్ నగేష్, మాలోతు హాథిరాం,మాలోతు అరుణ, ధీరావత్ రవినాయక్, వడత్యా బాలాజీ ,నాగ్య,శ్రీను రమణ, వినోద్, కిషన్,సందీప్, నాగేశ్వరరావు,మంగ్య,శివ, మధు, శంకర్ ,హరి, రమేష్, తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin