సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక తీసుకొని నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ఇల్లందు పట్టణంలో విజయవంతం చేసేందుకు మున్సిపల్ కార్యాలయం నందు అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఇల్లందు పురపాలక సంఘం. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, కమిషనర్ అంకు షావలి, డాక్టర్ కవిత పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమం ఉద్దేశించి చైర్మన్ మాట్లాడుతూ. ప్రభుత్వం తలపెట్టిన ఈ బృహత్తర కార్యక్రమాన్ని పట్టణ ప్రజలందరూ సద్వినిగం చేసుకోవాలని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కంటి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గౌరవ ఇల్లందు శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ చేతులమీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు టిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కొక్కు నాగేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిలర్లు వాంకుడోత్ తార, మొగిలి లక్ష్మీ, ఎలమందల వీణ, కటకం పద్మావతి, గిన్నారపు రజిత, అంకెపాక నవీన్ కుమార్, జె కె శ్రీనివాస్, వారా రవి, కుమ్మరి రవీందర్, కోఆప్షన్ సభ్యులు భాస శ్రీనివాస్, డి ఈ రచ్చ రామకృష్ణ, ఏఈ శంకర్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు...
-----------------------
Admin