సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పెనుకొండ పట్టణంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రాజెక్టు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్, అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు బావమ్మ, ప్రాజెక్ట్ కార్యదర్శి శ్రీదేవి మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వం తెచ్చిన పేస్ యాప్ హాజరు వేయాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారు ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు పనిచేయడం లేదు అందులో యాప్స్ ఓపెన్ కాలేదు ఫేస్ యాప్ హాజరు వేయడం సాధ్యం కాని పని కొన్ని గ్రామాల్లో నెట్వర్క్ లేక యాప్ ఓపెన్ కాలేదు అంగన్వాడీలు అందరికీ పర్సనల్ ఫోన్లో కొనే స్తోమత లేదు అలాంటివారు ఆన్లైన్ వర్క్ చేయలేక అధికారులు పెట్టే ఒత్తిడి తట్టుకోలేక మనస్థాపాన్ని గురవుతున్నారు. రకరకాల యాపులు తీసుకువచ్చి అంగన్వాడీలపై పని భారం పెంచారు. అంగన్వాడి కేంద్రాలలో మౌలిక వసతులు లేవు కరెంటు సౌకర్యం కూడా లేదు ఉన్న సెంటర్లకు ప్రభుత్వం బిల్లు చెల్లించదు గత 5 సంవత్సరాలు నుండి టిఏ,డీఏలు దీనివల్ల దీనివలన అంగన్వాడిలో అప్పులు చేసిరాలేదుసెంట్రర్లు నడుపుతున్నారు .రాలేదు అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో మేరకు ధర్నా నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ డిమాండ్లు పరిష్కరించాలని ఫేస్ యాప్ రద్దు చేయాలి పర్యవేక్షణపేర్లతో వేధింపు ఆపాలి,ప్రభుత్వం కేటాయించిన సెంటర్ అద్దెలు పూర్తిగా చెల్లించాలి, కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలి, వైయస్సార్ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచాలి, గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలి, 2017 నుంచి పెండింగ్లో ఉన్న టిఏ బిల్లులు వెంటనే ఇవ్వాలి ,300జనాభా దాటిన మినీ సెంటర్లో మెయిన్ సెంటర్ లాగా మార్చాలి మినీ వర్కర్లకు వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలి ,ఆయాలను కేటాయించాలి, సుప్రీంకోర్టు గ్రాడ్యుయేట్స్ ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5లక్షలు ఇవ్వాలి పెన్షన్ సౌకర్యం కల్పించాలి. సీనియారిటీ ప్రకారం గౌరవ వేతనం ఇవ్వాలి సూపర్వైజర్ పోస్ట్ వయో పరిమితి తొలగించాలి, ర్యాలీలు సభలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన go నెంబర్1 వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. లేనిపక్షంలో అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చేపడతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వజ్రం నాగప్ప, మురళి అంగన్వాడి వర్కర్స్ యూనియన్ నాయకురాలు జయమ్మ, లక్ష్మి, వరలక్ష్మి,మంజుల ,నాగమణి ,షర్మిల భాను ,ఉషారాణి ,అనంతమ్మ ,సుబ్బలక్ష్మి , శోభారాణి తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin