Sunday, 26 July 2026 04:55:26 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గూర్చి మాట్లాడే నైతిక హక్కు బిజెపికి లేదు... ఎంసిపిఐ(యు) వరంగల్ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్

Date : 15 September 2025 06:14 AM Views : 418

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలో మరపురాని ఘట్టమని, రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను నిర్మిస్తామని ఎంసిపిఐ(యు) వరంగల్ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు. దుగ్గొండి మండలం గిర్నిబావి జి ఆర్ బి ఫంక్షన్ హాల్లో డివిజన్ కమిటీ ఆధ్వర్యంలోతెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజాసాహెబ్ అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముందుగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరులు అసెంబ్లీ టైగర్ మద్దికాయల ఓంకార్, భీమిరెడ్డి నరసింహారెడ్డి గార్ల చిత్రపటాలకు సమావేశం పూలమాలవేసి నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అతిధిగా హాజరైన జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1946 మొదలుకొని 1951 వరకు కొనసాగిందని, ఈ పోరాటంలో కమ్యూనిస్టులు నిజాం సర్కార్ కు మరియు నిజాం కు తొత్తులుగా ఉన్న రజాకార్లకు, దేశ్ ముఖ్, మరియు భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా జరిగిన వీరోచిత పోరాటంలో అసెంబ్లీ టైగర్ మద్దికాయాల ఓంకార్, భీమిరెడ్డి నరసింహారెడ్డి గార్లు చేసిన పోరాటం బావి తరాలకు ఆదర్శనీయమని, నేటి యువత అలాంటి గొప్ప కమ్యూనిస్టు ల చరిత్రను తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు త్యాగాలు చేస్తే, సాయుధ పోరాటంతో ఎలాంటి సంబంధం లేని బిజెపి నాయకులు రైతాంగ పోరాటాన్ని హిందూ ముస్లింల మధ్య జరిగిన కొట్లాటగా మాట్లాడడం వారి రాజకీయ అవగాహన లేమికి నిదర్శనమని, సాయుధ పోరాటం గురించి మాట్లాడి నైతిక హక్కు వారికి లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాపురావు, వంగల రాగసుధ, కన్నం వెంకన్న, మండల కార్యదర్శులు సంగతి మల్లికార్జున్, దామ సాంబయ్య, కలకోట్ల యాదగిరి,గాజుల వెంకటయ్య, డివిజన్ కమిటీ సభ్యులు గటికె జమున, తడుక కౌసల్య, గీసపాక కొమురయ్య, బుడిమే సురేందర్, బత్తిని కుమారస్వామి,అనుముల రమేష్, సొల్లేటి సీతారాములు తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: