Monday, 27 July 2026 06:15:35 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం రాష్ట్ర మహాసభలు...

Date : 31 July 2023 07:07 AM Views : 502

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల్ని సింగరేణి యాజమాన్యం మరియు రాష్ట్ర ప్రభుత్వము బానిసలుగా చూస్తుందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ విమర్శించారు. సింగరేణిలో పనిచేస్తున్న సుమారు 40000 మంది కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ఎస్సీ కేఎస్ సిఐటియు రాష్ట్ర ఆరో మహాసభల సందర్భంగా భూపాల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకు కార్మిక చట్టాలు అమలు కావడం లేదని పేర్కొన్నారు సింగరేణి యాజమాన్యం చట్టాలకు నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల పట్ల వివక్షతను చూపుతోందని ఇది ఎంత మాత్రం సరైనది కాదని పేర్కొన్నారు కాంట్రాక్ట్ కార్మికుల పట్ల యాజమాన్యం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యాన్ని వివక్షతను ఐక్య ఉద్యమాల ద్వారా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. కోలిండియా కి అనుబంధంగా ఉన్న సింగరేణి సంస్థ కాంట్రాక్టు కార్మికుల వేతనాలపై కోల్ ఇండియా చేసిన ఒప్పందాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు ఒప్పందంలో సంతకం పెట్టి వచ్చిన సింగరేణి యాజమాన్యం తాను అంగీకరించిన ఒప్పందాన్ని సైతం ఉల్లంఘించడం చట్ట వ్యతిరేకమైన చర్యగా పేర్కొన్నారు. కోల్ ఇండియా వేతన ఒప్పందం అమలు కాకపోవటం వల్ల సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు ఒక్కొక్కరు నెలకు 15,600 నష్టపోతున్నారని ఇప్పటికి వేలకోట్ల రూపాయల వేతనాలను కోల్ ఇండియా ఒప్పందం అమలు కాకపోవటం మూలాన కాంట్రాక్ట్ కార్మికుల నష్టపోయారని ఈ విధంగా కార్మికులు నష్టపోతున్న రాష్ట్ర ప్రభుత్వం గానీ సింగరేణి యాజమాన్యం కానీ స్పందించకపోవడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు కోల్ ఇండియా యాజమాన్యం కార్మిక చట్టాల ప్రకారం సింగరేణి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ డిమాండ్ చేశారు . కాంట్రాక్ట్ కార్మికుల శ్రమతోటే సింగరేణి నడుస్తుందని కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ వల్లనే సింగరేణి లాభాల బాట పట్టిందని ఈ వాస్తవాన్ని అటు యాజమాన్యం ఇటు రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తున్నాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా కేంద్ర బిజెపి ప్రభుత్వం బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేస్తుందని దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రకృతి వనరులను దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలన్నింటిని తూట్లు పొడుస్తుందని విమర్శించారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడులు కార్మికులకు ఉరితాడు లాంటివని పేర్కొన్నారు . లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు . కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రైవేటీకరణ కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 8 9 తేదీలలో మహా పడావు పేరిట అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు మహాధర్నాలకు కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయని ఈ ధర్నాలలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు పర్మినెంట్ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్పొరేట్ అనుకూల కేంద్ర బిజెపి ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించటం కోసం దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలను ఐక్యం చేసి సంఘటిత పోరాటాలకు సిఐటియు నాయకత్వం వహిస్తుందని పేర్కొన్నారు. మతం కులం వంటి సున్నితమైన అంశాలను రెచ్చగొట్టి భావోద్వేగాలను రెచ్చగొట్టి కార్మిక ఉద్యమాలను కార్మిక ఐక్యతను విచ్ఛిన్నం చేయటం కోసం కేంద్ర బిజెపి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. మతోన్మాదం కులతత్వం కార్పోరేట్ అనుకూల ఆర్థిక విధానాలపై ఏకకాలంలో కార్మికులు పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడిందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపాల్ పేర్కొన్నారు. కార్మిక ఉద్యమాలను సంఘటితం చేయటం ద్వారా కార్మిక వర్గ ఐక్యత కోసం సిఐటియు నిరంతరం కృషి చేస్తుందని ఈ కృషిలో సింగరేణి కాంట్రాక్టు కార్మికులు మరింత భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు *సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లు న్యాయమైనవే - కాంట్రక్టుకార్మికుల సంఘం రాష్ట్ర మహాసభలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు* సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు కోరుతున్న డిమాండ్లు న్యాయమైనవేనని వాటి పరిష్కారం కోసం సిఐటియు నాయకత్వంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న పోరాటాలు విజయవంతం కావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం రాష్ట్ర ఆరవ మహాసభ కొత్తగూడెంలో మంచి కంటి భవన్లో ప్రారంభమైంది ఆరో మహాసభలకు ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు మహాసభకు హాజరై ప్రతినిధులను ఉద్దేశించి సందేశం ఇచ్చారు కొత్తగూడెం కేంద్రం బొగ్గు గాని కార్మికులకు ఉద్యమాల కేంద్రమని పేర్కొన్నారు పర్సా సత్యనారాయణ జార్జి శేషగిరిరావు వంటి కార్మిక యోధుల నాయకత్వంలో సింగరేణిలో అనేక ఉద్యమాలు నడిచాయని పేర్కొన్నారు బొగ్గు గని కార్మికుల పోరాటాలకు కేంద్రమైన కొత్తగూడెంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం రాష్ట్ర మహాసభలు జరగటం అభినందనీయమైన అంశమని పేర్కొన్నారు సింగరేణి అభివృద్ధికి సింగరేణి లాభాలకు కాంట్రాక్ట్ కార్మికుల యొక్క శ్రమ కీలకంగా ఉందని పేర్కొన్నారు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తానని కాంట్రాక్ట్ కార్మికులకు మెరుగైన వేతనాలు చట్టబద్ధమైన సౌకర్యాలు ప్రభుత్వం వైపు నుంచి అందించే విధంగా ప్రయత్నం చేస్తానని కంచర్ల చంద్రశేఖర రావు పేర్కొన్నారు కాంట్రాక్ట్ కార్మికుల యొక్క హక్కుల సాధన కోసం ఆరో మహాసభలో చేసే తీర్మానాలు నిర్ణయాలు వాటి ద్వారా నిర్వహించే పోరాటాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు కొత్తగూడెం కేంద్రం యొక్క పోరాటాల వారసత్వాన్ని నిలబెట్టాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలోని సింగరేణి ప్రాంతం మొత్తం ఉద్యమాలకు ప్రాతినిధ్యం వహిస్తూ మహాసభకు హాజరైన ప్రతినిధులకు కొత్తగూడెం ప్రజల తరఫున సింగరేణి కార్మికుల తరఫున స్వాగతం తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. పోరాడితేనే హక్కులు *సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ఎస్సీ కేఎస్ సిఐటియు రాష్ట్ర మహాసభలో సింగరేణి రిటైర్డ్ జిఎం ఆనందరావు. - కార్మికులు పోరాడితేనే హక్కులు వస్తాయని చరిత్ర మొత్తం దీన్నే రుజువు చేసిందని సింగరేణి మాజీ జనరల్ మేనేజర్ ఆనందరావు అన్నారు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ఎస్సీ కేఎస్ సిఐటియు రాష్ట్ర ఆరో మహాసభ కొత్తగూడెంలో మంచి కంటి భవన్లో జరుగుతున్న నేపథ్యంలో ఆనందరావు పాల్గొని సందేశం ఇచ్చారు సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల యొక్క హక్కుల కోసం సిఐటియు నాయకత్వంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం నిరంతరం పోరాటాలు చేస్తుందని ఈ పోరాటాల వల్లనే ఇప్పుడు కార్మికులు అనుభవిస్తున్న కొద్దిపాటి హక్కులు సౌకర్యాలు లభించాయని పేర్కొన్నారు సింగరేణి సంస్థ లాభాలకు సింగరేణి అభివృద్ధికి కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న శ్రమ ప్రస్తుతం పునాదిగా ఉందని పేర్కొన్నారు కాంట్రాక్ట్ కార్మికులు సంక్షేమం కోసం మెరుగైన వేతనాల కోసం ఉద్యోగ భద్రత కోసం చేస్తున్న పోరాటాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆరో మహాసభ ముఖ్య భూమిక పోషించాలని ఆనందరావు ఆకాంక్షించారు కొత్తగూడెం కార్మిక పోరాటాలకు అభ్యుదయ ప్రజా ఉద్యమాలకు నిలయమని పేర్కొన్నారు కార్మికుల యొక్క హక్కుల కోసం ప్రజల సంక్షేమం కోసం జరిగిన అనేక ఉద్యమాలకు కీలకమైన నాయకులను అందించిన చరిత్ర కొత్తగూడెం సింగరేణికి ఉందని గుర్తు చేశారు కార్మికులు ఐక్యంగా పోరాడితేనే హక్కులు వస్తాయని సమస్యలు పరిష్కారం అవుతాయని గత చరిత్ర మొత్తం అదే రుజువు చేసిందని అదే మార్గంలో కాంట్రాక్టు కార్మికులు ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల పర్మినెంట్, కోలిండియా వేతనం అమలు కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కండి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ఎస్సీ కేఎస్ సిఐటియు రాష్ట్ర ఆరో మహాసభ పిలుపు* సింగరేణిలో పనిచేస్తున్న 40 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల పర్మినెంట్ కోసం అలాగే కోల్ ఇండియా వేతనాలు అమలు కోసం ఐక్య పోరాటాలకు సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు మరియు కాంట్రాక్ట్ కార్మికుల సంఘాలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం రాష్ట్ర ఆరవ మహాసభ పిలుపునిచ్చింది కొత్తగూడెం మంచి కంటి భవన్లో జరుగుతున్న ఆరవ మహాసభలో ఈ మేరకు ఒక తీర్మానాన్ని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ఎస్సీ కేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి మధు ప్రవేశపెట్టగా మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది సింగరేణిలో జీవో నెంబర్ 22 అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదేశాలు ఇవ్వాలని మహాసభ డిమాండ్ చేసింది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం పర్మినెంట్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులకు అన్ని హక్కులు సౌకర్యాలు సమానంగా అమలు చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం రాష్ట్ర ఆరవ మహాసభ డిమాండ్ చేసింది మహాసభ ప్రారంభ సూచికంగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ఎస్సీ కేఎస్ జెండాను యూనియన్ రాష్ట్ర నాయకురాలు తిరుపతమ్మ ఆవిష్కరించారు అనంతరం కార్మికుల నేత అమరజీవి పరస సత్యనారాయణ చిత్రపటానికి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ పూలమాలవేసి నివాళులర్పించారు అలాగే టి ఎన్ వి రమణ చిత్రపటానికి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఏజే రమేష్ పూలమాలవేసి నివాళులర్పించారు ఆరవ రాష్ట్ర మహాసభకు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం స్వామి హాజరై సందేశం ఇచ్చారు ఈ మహాసభలో సిఐటియు సీనియర్ నాయకులు ఎం సాంబశివరావు పాల్గొన్నారు యూనియన్ నాయకులు ఓదేలు కుమారి స్వామి అరవింద్ అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. అమరవీరులకు సంతాప తీర్మానాన్ని కుమారస్వామి ప్రవేశపెట్టగా మహాసభకు హాజరైన నాయకులు ప్రతినిధులు అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు కొత్తగూడెం బ్రాంచ్ కార్యదర్శి విజయగిరి శ్రీనివాస్ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం నాయకులు సూరం ఐలయ్య దూలం శ్రీను సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి డి వీరన్న, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్,కాంట్రాక్ట్ కార్మికుల సంఘం కొత్తగూడెం బ్రాంచ్ కార్యదర్శి జి శ్యామ్ నాయకులు భాస్కర్ ప్రభాకర్ గద్దల శీను సీనియర్ నాయకులు జి రాజారావు వైవి తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: