Sunday, 26 July 2026 09:54:30 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

క్రీస్తు వాక్యానుసారం జీవించాలి... -ఎంపిటిసి మీసాల ఉపేందర్

Date : 29 September 2023 05:34 AM Views : 271

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు : ప్రజలందరూ క్రీస్తు బోధనలు తెలుసుకొని ఆయన చెప్పిన ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటూ క్రీస్తు జీవితం ఆదర్శంగా తీసుకొని, పది ఆజ్ఞాలు పాటిస్తూ ఆయన వాక్యానుసారం జీవించాలని, శాంతియుతంగా, భక్తి శ్రద్ధలతో , సుఖ సంతోషాలతో వార్షికోత్సవాలు జరుపుకోవాలని ఎంపిటిసి ల ఫోరమ్ మండల అధ్యక్షులు మీసాల ఉపేందర్ కోరారు. పాలక వీడు మండలం లోని నాగిరెడ్డిగూడెం ఆవాస గ్రామం బెట్టేగూడెం క్రీస్తు సంఘం చర్చ్ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రజల పాపాల తొలగించుటకు శిలువ వేయబడి మరల తిరిగి వచ్చిన శాంతిదూత ఏసుప్రభువు అని,అతని మార్గంలో జీవించాలని కోరారు.క్రీస్తు బోధనలను సంఘ కాపరులు మీసాల ప్రభుదాస్,మీసాల జ్యోతిబాబు లు బోధించారు. క్రైస్తవులు చక్కని గీతాలు ఆలపించారు.ఈ కార్యక్రమంలో నాయకులు మునగాల సైదిరెడ్డి,ఒంటెద్దు మట్టారెడ్డి, కందుకూరి సైదిరెడ్డి మంద నాగయ్య,మంద సైదులు,మంద చిన లాజర్, పిట్ట అబ్రహం,ముల్కలపల్లీ శ్రీను,అరోను,మంద కర్ణకర్, పిట్ట పెద కోటయ్య,పిట్ట కోటయ్య,యూత్ సభ్యులు,సంఘ పెద్దలు,క్రైస్తవ సోదరి సోదరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :