Monday, 27 July 2026 03:27:03 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తే అది ప్రజా పాలన అలా కాకుంటే ప్రజా పీడన...

Date : 04 November 2024 12:13 AM Views : 518

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారెంటీలలో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో రాజకీయ జోక్యం తగదని బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు రాపోలు నవీన్ కుమార్ అన్నారు అయన నేరేడుచర్లలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిందని కానీ ఇటీవల కాలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కమిటీలు వేశారని అందులో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఉన్నారని, అంటే త్వరలో నిర్మించబోయే ఇళ్లు కేవలం కాంగ్రెస్ పార్టీ వారికి మాత్రమే సూచనప్రాయంగా ప్రజలకు అర్థమవుతుందని అదే జరిగితే నిజమైన అర్హులకు ఎంతో అన్యాయం జరుగుతుందని నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాజకీయ జోక్యం లేకుండా చేసి ఇండ్లు లేక రోడ్లకు ఇరువైపులా జీవిస్తున్న వారికి ఇండ్లు లేని నిరుపేదలను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తే అది ప్రజా పాలన అవుతుందని...అలా కాకుంటే అది ప్రజా పీడన అవుతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు హామీలను ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే తీరా అధికారంలోకి వచ్చాక మంత్రులు తలో మాట మాట్లాడుతున్నారని దీపావళిక ముందే బాంబుల పేలుస్తామని ఒక మంత్రి అంటే త్వరలోనే టిఆర్ఎస్ మాజీ మంత్రులను అరెస్టు చేస్తావని ప్రగాల్భాలు పలుకుతున్నారని ప్రతి ఎమ్మెల్యే ఒక మంత్రి లాగా ఫీల్ అవుతున్నారని ప్రతి మంత్రి ముఖ్యమంత్రి లానే ఫీలయ్యి ఊహల్లో జీవిస్తున్నారని, త్వరలోనే ముఖ్యమంత్రి మారుస్తారని ఆ పార్టీ వాళ్లే ప్రచారం చేసుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఏడాదికో ముఖ్యమంత్రి మారతారనే విషయం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసునని పరిపాలించడం చేతకాక ప్రజల దృష్టి మరల్చేందుకు ఇలా ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ పల్లెపంగ నాగరాజు, రాం సైదులు, పెరుమాళ్ళ సతీష్ కుమార్, షేక్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :