సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మండలంలో చోటు చేసుకున్న ప్రభుత్వ భూ కుంభకోణంలో గత హుజూర్ నగర్ తహసీల్దార్ వజ్రాల జయశ్రీ మరియు ధరణి ఆపరేటర్ వత్సవాయి జగదీష్ ఇరువురు కలిసి 36.23 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇతర వ్యక్తుల పేర్లపై అక్రమంగా మార్పిడి చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడి అట్టి భూములపై వచ్చిన రైతుబంధు సొమ్మును కాజేసిన కేసులో అక్టోబర్ 8న అరెస్టయి స్థానిక సబ్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. స్థానిక పబ్లిక్ ప్రాసిక్యూటర్ షకీల్ అహ్మద్ అన్సారి తెలిపిన వివరాల ప్రకారం...తహశీల్దార్ జయశ్రీని తదుపరి విచారణకై పోలీస్ కస్టడీకి కోరుతూ స్థానిక సీఐ చరమందరాజు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా హుజూర్ నగర్ జూనియర్ సివిల్ జడ్జి ఒకరోజు కస్టడీకి అనుమతించారని హుజూర్ నగర్ న్యాయమూర్తి సెలవులో ఉన్నందున తిరిగి సోమవారం స్థానిక సీఐ చరమందరాజు తహశీల్దార్ ను మూడు రోజుల కస్టడీకి కి ఇవ్వమని కోరుతూ కోదాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం జయశ్రీని మూడు రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కాగా జయశ్రీకి బెయిల్ మంజూరి చేయాలంటూ దాఖలైన బెయిల్ పిటిషన్ ను న్యాయమూర్తి కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు...
-----------------------
Admin