సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం జిల్లా : ఉమ్మడి అనంతపురం జిల్లాలో నియోజకవర్గం స్థాయి వాలీబాల్ పోటీలు ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పామిడి పట్టణంలో జరిగాయి. ఈ పోటీల్లో వాలీబాల్ అండర్-14 విభాగం పుట్టపర్తి నియోజకవర్గం జట్టు విజయం సాధించినట్లు పిఈటి రియాజ్ తెలిపారు. ఇందులో ఓబులదేవర చెరువులోని జీవనజ్యోతి విద్యార్థులు లోకేష్, తిలక్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఆయన చెప్పారు. మా విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం సంతోషంగా ఉందని జీవనజ్యోతి హెచ్ఎం. సిస్టర్ రిన్సి, పిఈటి రియాజ్ తెలిపారు. భవిష్యత్తులో ఈ విద్యార్థులు క్రీడల్లో మరింత భాగాల నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలని పి ఈ టి ఆకాంక్షించారు.
-----------------------
Admin