సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : లక్ష్మిదేవిపల్లి మండలం, రేగళ్ల క్రాస్ దగ్గర మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వస్తున్న బైక్ డివైడర్‌ను ఢీ కొంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు బాబుక్యాంప్‌కు చెందిన నీరజ్, డింపులుగా గుర్తించారు. మరో యువతికి తీవ్రగాయాలు అయ్యాయి. ఆమెను సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది....
-----------------------
Admin