సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలం చౌటపల్లి కేంద్రంలో మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆర్థిక సహాయంతో పశు వైద్య మరియు పశుసంవర్ధన శాఖ సూర్యపేట వారి ఆధ్వర్యంలో మేఘ పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎన్ .శ్రీనివాసరావు (ప్రెసిడెంట్ వర్క్స్ & యూనిట్ హెడ్) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మఠంపల్లి ఎంపీపీ మూడవత్ పార్వతి కొండా నాయక్, జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాసరావు, ఆర్ .జగన్నాథరావు (అడ్వైజర్)పి& ఏ కే .ఎన్ రావు (జీఎం) పి & ఏ కే. శ్రీనివాసరావు (జీ.ఎం) మైన్స్ పాల్గొన్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాసరావు, ఎంపీపీ పార్వతి కొండా నాయక్ మాట్లాడుతూ... మై హోమ్ ఇండస్ట్రీస్ యాజమాన్యానికి రైతుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, రైతు సోదరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు చౌటపల్లి ఎంపీటీసీ సైదా కుమారి కాశయ్య, మాజీ ఎంపీపీ లక్ష్మీ వెంకట్ నారాయణ, మాజీ సర్పంచ్ కృష్ణవేణి నరేష్, రామిరెడ్డి, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సహాయ సంచాలకులు డాక్టర్ అనిల్ కుమార్, రూప కుమార్ ,పశువై ద్య అధికారులు సుస్మిత ,ఉషారాణి, రమేష్ ,వీరారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ,శంకర్, మధు పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. పశు వైద్య సిబ్బంది శేషగిరిరావు, రామ కాంత్ ,పంచాయతీ కార్యదర్శి కవిత, గోపాలమిత్రలు ఉపేందర్, రామ్మోహన్ ,అజయ్ ,సురేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 139 పశువులకు పరీక్షలు చేసి అవసరమైన మందులు అందించారు. 34 కుక్కలకి రేబిస్ వ్యాక్సిన్ ఉచితంగా చేసి 2500 జీవాలకు లివర్ టానికులు అందజేశారు...
-----------------------
Admin