Sunday, 26 July 2026 10:01:23 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ ఏం చేసింది..?

Date : 21 November 2023 09:40 AM Views : 487

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయినా రావాల్సినంత ప్రజాస్వామ్య పరిణతి రాలేదనీ ప్రజాస్వామ్య పరిణతి వచ్చినప్పుడే ప్రజలకు మేలు జరుగుతదనీ, విచక్షణతోటి బాగా ఆలోచించి మంచి అభ్యర్థికి, మంచి పార్టీకి ఓటెయ్యాలి. కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి ఆషామాషీగా ఓటు వేయొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ అన్నారు. నందిగామ మండలం మామిడిపల్లి, శ్రీనివాసుల గూడ, మొదళ్ళ గూడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ కు ఆయా గ్రామాల్లో ప్రజల నుండి భారీ స్పందన లభించింది. స్ధానిక నేత మాజీ జెడ్పి వైస్ చైర్మన్ నాగర్ కుంట నవీన్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో టిఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సంధర్భంగా ఎమ్మేల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. ఏ పార్టీకి ఓటేస్తే మంచి జరుగుతది.. ఏ పార్టీకి ఓటేస్తే చెడు జరుగుతది..? అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయగలగాలనీ, ప్రజలకు ఉన్న ఒకే ఆయుధం ఓటు. ఆ ఓటును సక్రమంగా వినియోగించుకోవాలె’ అని అంజయ్య చెప్పారు. ‘పార్టీల చరిత్ర, నడవడిక చూసి ఓటు వేయాలె. బీఆర్‌ఎస్‌ పార్టీ చరిత్ర ఏందో మీకు తెలుసు. బీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. తెలంగాణ అభివృద్ధి కోసం. తెలంగాణ ఏర్పాటైనంక బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంత బాగా అభివృద్ధి చేసిందో మీరందరూ చూస్తున్నరు. మరె 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ ఏం చేసింది..? అడుగడుగునా తెలంగాణను మోసం చేసింది. కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసిన కరువు కాటకాలే ఉండె. పత్తికాయలు పగిలినట్లు రైతులు గుండెలు పగిలి చనిపోయిండ్రు. అదీ కాంగ్రెస్‌ పరిపాలన’ అని అంజయ్య ఎద్దేవా చేశారు. గెలుపొందిన నాటి నుండి చేసిన అభివృద్ధి. సంక్షేమ కార్యక్రమాలు ఎమ్మేల్యే అంజయ్య యాదవ్ ప్రజలకు వివరించారు. మొదళ్ళగూడ, శ్రీనివాసుల గూడ నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు. రూ.1.27 కోట్లతో సి.సి రోడ్డు నిర్మాణం పనులు, అంతర్గత మురుగు కాలువలు, ఆసరా పింఛన్ ధ్వారా ప్రతి నెల 449 మందికి 9.94లక్షల రూపాయలు వస్తున్నాయి. రైతు బంధు లబ్ధిదారులు 1299 మంది, 15.22 కోట్లు, రైతు రుణమాఫీ లబ్ధిదారులు 661 మంది, 4.78కోట్లు, రైతు భీమా లబ్ధిదారులు 28మంది, 140 లక్షలు, కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులు 89 మంది, 80.10 లక్షలు, స్మశానవాటిక నిర్మాణం కోసం 37లక్షలు. పాత జాతీయ రహాదారి నుండి మామిడిపల్లి వయా అప్పరెడ్డి గూడ బి.టి రోడ్డు 3.7 కోట్లు, చేగూర్ నుండి మామిడిపల్లి డబుల్ రోడ్డు నిర్మాణం 7 కోట్లు మంజూరు. ఈదుల పల్లి నుండీ మసీద్ మామిడి పల్లి వయా శ్రీనివాసుల గూడ 2.53 కోట్లు, మంచన్ పహాడ్ బి.టి రోడ్ 45లక్షలు, 1.22కోట్ల వ్యయంతో మిషన్ భగీరథ ద్వారా 6 ట్యాంకుల నిర్మాణంతో 1040 ఇండ్లకు త్రాగునీటి సరఫరా..మిషన్ కాకతీయ ద్వారా 42లక్షలతో కొండేటి కుంట, 7.35లక్షలతో మార్గ వాని కుంట, 20.69 లక్షలతో పార్వతి కుంటాల పూడికతీత, మామిడిపల్లి సీతారామచంద్ర స్వామీ దేవస్థానం అభివృద్ధి 50 లక్షలు, గ్రామ పంచయతీ భవనం 25లక్షలు, రైతు వేదిక 22 లక్షలు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన కారుగుర్తు పార్టీకి అండగా ఉంటూ కారుగుర్తుకు ఓటు వేసి మరొక్కసారి ఆశీర్వదించాలి, అభివృద్ధిని కొనసాగిద్దామని ఈ సందర్భంగా ప్రజలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ కోరారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :