సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి మండల కేంద్రంలో కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాలు తలపెట్టిన ఈనెల 16న కార్మికుల సమ్మె గ్రామీణ బంధుని విజయవంతం చేయాలని పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కమల నవీన్ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల కనీస వేతనాలను ఈ పదేండ్ల కాలంలో సవరించకుండా నిర్లక్ష్యం వ్యవహరించడంతో కార్మికుల ప్రమాణాలు దిగజారాయని ఆవేదన వ్యక్తం చేశారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యవసరవ సరుకుల ధరల విపరీతంగా పెరిగాయని వీటిని నియంత్రించడంలో వైఫల్యం చెందిందని విమర్శించారు నాలుగు లేబరు కో డ్ లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై జరిగే భారత్ బంద్ సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 16వ తారీఖున జరిగే సమ్మెను ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కామల్ల సుందరయ్య ఎన్ ఉమాలక్ష్మి జి ఇందిరమ్మ ఎస్ దీనారాణి ఎం లక్ష్మి సిహెచ్ నాగేంద్ర సిహెచ్ అంజమ్మ ఎస్.కె కాలుష్య బేగం ఎం నాగమణి ఎం మంగమ్మ డి చిన్ని ఎన్ అలివేలు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin