సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామంలో హుజూర్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సూచనల మేరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రాష్ట్రమంతటా (మిషన్ భగీరథ) మంచినీటి పండగ కార్యక్రమంలో ఎంపీపీ మూడవత్ పార్వతి కొండ నాయక్ , హుజూర్ నగర్ ఎంపీపీ గూడెంపు శీను , గరిడేపల్లి ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కనీస అవసరమైన తాగునీటిని అందించడంలో విఫలమయ్యాయి. ఎండాకాలం వచ్చిందంటే గుక్కెడు తాగునీటికి ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపేవారు. తాగునీటికి పంచాయితీలు మున్సిపాలిటీలను ముట్టడించేవారు. దీంతో ఆయా పాలకవర్గాలు కంటి తుడ్పు చర్యగా ట్యాంకర్లు, ఆటోల, ద్వారా అరకోరా నీటిని అందించి, చేతులు దులుపుకునేవి. చాలీచాలని నీలతో రాత్రింబవళ్లు నిద్రలు మాని బిందెలతో గొడవలు చేసుకునే పరిస్థితి గతంలో ఉండేవి. పంచాయతీలు బోర్లు వేయలేక వేసిన భూగర్భ జలాలు లేక నీళ్లు పడక తాగునీటి సమస్య నిత్య కృత్యంగా ఉండేది. ఈ పరిస్థితులను గమనించిన సీఎం కేసీఆర్ స్వరాష్ట్రంలో ఇంటింటికి ఉచిత గా స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని తీసుకువచ్చారు. అపర భగీరధుడు సీఎం కేసీఆర్ మానస పుత్రిక మిషన్ భగీరథ పథకం దశాబ్దాల నీటి కోరత తీర్చింది. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని అందించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పథకం సత్ఫ లితాల నిస్తున్నది. కొండలు, కోనలు, గుట్టలు దాటి వేల కిలోమీటర్లు ప్రయాణించి నట్టింట సాక్షాత్క రిస్తున్నది. తాగునీరు ఇంటి ఆవరణలో గలగల పారుతుంటే గిరిజనులు చిరునవ్వులు చిందిస్తూ తమ అవసరాలు తీర్చుకుంటున్నారు. చెక్ డ్యాములు నిర్మించడం వల్ల భూగర్భ జలాలు పెరిగాయని వారు పేర్కొన్నారు. చెక్ డ్యాముల ద్వారా వేల ఎకరాలు సాగులోకి వచ్చాయని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో డి పి ఓ యాదయ్య, ఎమ్మార్వో సాయి గౌడ్ ,ఎంపీడీవో జానకి రాములు, స్పెషల్ ఆఫీసర్, మిషన్ భగీరథ డి ఈ సూర్యాపేట ఎం వేంకటేశ్వర్లు, డి ఈ మిషన్ భగీరథ కోదాడ హుజూర్ నగర్ డి ఈ అభినయ్, ఏ ఈ శరత్ చంద్ర ఏ ఈ లు,ఎం పి ఓ ఆంజనేయులు ఎపీఓ ఉమ మట్టపల్లి సర్పంచ్ విజయలక్ష్మి వెంకటరమణ , రామచంద్రపురం సర్పంచ్, కృష్ణా నాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, మహిళలు, అంగన్వాడి కార్యకర్తలు, ఆశాలు, కార్యదర్శులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin