సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి గారి కార్యాలయం భద్రాద్రి కొత్తగూడెం... 28/10/ 2023న జిల్లా కార్యాలయం నందు గౌరవనీయులైన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జె వి ఎల్ శిరీష గారి ఆధ్వర్యంలో జిల్లాలోని డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారిని గారు మాట్లాడుతూ....ABDM (ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్) లో భాగంగా జిల్లాలో ఉన్న ప్రతి ప్రైవేటు మరియు గవర్నమెంట్ ఆసుపత్రులు హెచ్.ఎఫ్.ఆర్(Health Facilty Registration) ఆన్లైన్ పోర్టల్ నందు మరియు ప్రైవేటు మరియు గవర్నమెంట్ ఆసుపత్రులలో పని చేసే ప్రతి ఒక్క మెడికల్ మరియు పారామెడికల్ స్టాఫ్(Anm to Doctor) యొక్క వివరాలనుహెచ్.పి.ఆర్ (Health Professional Registration) ఆన్లైన్ పోర్టల్ నందు నమోదు చేయాలని తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డెమోలు ఎండి. ఫైజ్ మొహిద్దిన్ ,నాగలక్ష్మి, హెల్త్ ఎడ్యు కేటర్లు బేబీ, రమాదేవి, డేటా ఎంట్రీ ఆపరేటర్లు రమేష్, శివ,స్ఫూర్తి, ప్రవీణ, సంధ్య, తార, శారద, శిరీష, రమాదేవి ,శివ నాగరాజు పాల్గొన్నారు
-----------------------
Admin