సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలో ఉమ్మడి నల్గొండ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు నిజాముద్దీన్, హుజూర్ నగర్ నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు షేక్ సైదా తో కలిసి ఉస్మానియా మజీద్ నందు పవిత్ర శుక్రవారం సందర్భంగా హుజూర్ నగర్ అసెంబ్లీ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపు కొరకు ప్రత్యేక ప్రార్థన నిర్వహించి అనంతరం బిఆర్ఎస్ ప్రభుత్వం మరియు కేసీఆర్ మైనార్టీలకు చేసిన ద్రోహాన్ని వివరిస్తూ మైనార్టీ సోదరులతో కలిసి కరపత్రాల ను విడుదల చేశారు. ఇట్టి కరపత్రాల నందు కెసిఆర్ ఇచ్చిన ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ అని చెప్పి మొండి చేయి చూపించడం, ధరణి పేరిట అన్ని చోట్ల వక్ఫ్ ఆస్తులను కబ్జా చేయటం,హైద్రాబాద్ లో హుజూర్ నగర్ లో వక్ఫ్ ఆస్తులు కబ్జాలకు గురి అవుతున్నా ఎవరూ పాటించుకోవటం లేదని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి అనేక రకాలు గా ఇబ్బంది పెట్టటం,మైనార్టీలకి లోన్ ల విషయం లో కూడా ఎలాంటి న్యాయం జరగలేదు అని వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.
-----------------------
Admin