సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గురువారం జరుగుతున్న గ్రామపంచాయతీ మొదటి విడత ఎన్నికలకు సంబంధించి పలు గ్రామపంచాయతీలో జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీతిసింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ నమలికొండ, జఫర్ ఘడ్, ఇల్లందు, పర్వతగిరి, కల్లెడ, వడ్లకొండ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన భద్రత ఏర్పాటతో పాటు ఎన్నికలు జరుగుతున్న తీరుతెన్నుల లపై పోలీసు కమిషనర్ అధికారులతో క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ఈ సందర్భంగా పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలపై కమిషనర్ అధికారులకు పలు సూచన సలహాలు అందజేశారు. సీపీ వెంట డిసిపిలు అంకిత్ కుమార్, రాజమహేంద్ర నాయక్, ఏసీపీ వెంకటేష్, నర్సయ్య, నాగయ్య తో పాటు స్థానిక ఇన్స్ స్పెక్టర్లు, ఎస్. ఐలు పాల్గొన్నారు.
-----------------------
Reporter