సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : మహిళా రెజ్లర్స్ ను లైంగికంగా వేధించిన బిజెపి ఎంపీ. బ్రిజ్ భూషణ్ ను వెంటనే అరెస్టు చేయాలని ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా ప్రధాన *కార్యదర్శి దాసు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపుమేరకు జక్రాంపల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో మహిళా మల్లాయోధుల న్యాయ పోరాటానికి ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపుమేరకు 2023 మే 15న సంఘీభావ ప్రదర్శన నిర్వహించినట్లు దాసు, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు సూర్య శివాజీ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒలింపిక్స్ క్రీడల్లో అనేక పథకాలు సాధించి దేశ ప్రతిష్ట నిలబెట్టిన మహిళా మల్లాయోధులను రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షులు బ్రిజ్భూషన్ చరణ్ సింగ్ లైంగికంగా వేధింపులకు పాల్పడినారని ఫిర్యాదులు చేసిన, భారత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంలో అంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు. బ్రిజ్ భూషణ్ పై క్రిమినల్ మరియు ఇతర కేసులు అనేకం ఉన్న, మోడీ తెచ్చిన " భేటీ పడావో బేటి బచావో " కార్యక్రమానికి కళంకం తెచ్చిన బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ పై 2023 ఏప్రిల్ 28న ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేసిన అరెస్టు చేయకపోవడం విచారకరమని వారు అన్నారు. బాధితులు న్యాయంకోసం పదిమంది మహిళా క్రీడాకారులు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారని, న్యాయం కోసం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తే వారిపై పోలీసుల నిర్బంధం ఏమిటని వారు ప్రశ్నించారు. దేశంలో మహిళా వివక్షత కొనసాగుతుందని, మహిళలు జీవించే హక్కును హరించడం మోడీ సర్కారుకు ఎవరిచ్చారు అని వారు ప్రశ్నించారు. భారతదేశాన్ని భారతమాతగా పోల్చుతూ ఉపన్యాసాలు ఇచ్చే బిజెపి పార్టీకి భారత మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు ఎందుకు కనిపించడం లేదని వారన్నారు. 40 మంది భారత మహిళా మల్లాయోధులు చేస్తున్న న్యాయపోరాటానికి ఐ ఎఫ్ టి యు సంపూర్ణ మద్దతును తెలియజేస్తుందని వారు తెలిపారు. మహిళా క్రీడాకారులను వేధించిన బ్రిజిభూషణ్ నిర్భయంగా స్వేచ్ఛగా ఒక దిక్కు తిరుగుతుంటే న్యాయం కోసం పోరాడుతున్న బాధితులపై పోలీసులు లాఠీచార్జి చేయడం అత్యంత అమానుషమని వారన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక దిక్కు ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని ప్రైవేటు వ్యక్తులు అమ్మి వేయడం, మరో దిక్కు కార్మిక, రైతు ,ప్రజా వ్యతిరేక చట్టాలు తీసుకురావడం, ఇంకొక దిక్కు భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం, మహిళల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం చేస్తోందని వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ క్రీడా పోటీల్లో భారత గౌరవాన్ని సమున్నతంగా నిలబెట్టిన క్రీడాకారులకే న్యాయం చేయని మోడీ ప్రభుత్వం ,నిత్యం ప్రభుత్వ కార్యాలయాల్లో లైంగిక వేధింపులకు బలి చేయబడుతున్న మహిళలను ఎలా రక్షిస్తుందని వారు నిలదీశారు. ఇప్పటికైనా నిష్పక్షపాతంగా విచారణ జరిపి చట్టబద్ధంగా ఎంపీ . బ్రిజ్ భూషణ్ ను శిక్షించాలని, ప్రధాని నరేంద్ర మోడీని వారు కోరారు. "ఆడది అంటే అబల కాదని, మహిళలను రెండవ శ్రేణి పౌరులుగా చూడడం మాని, "మహిళలను ఎవరు లైంగికంగా వేధించిన, అత్యాచారాలకు పాల్పడిన కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. రాజకీయ అండతో కామాంధులకు మద్దతు ఇస్తే మహిళా కోపాగ్నికి బలికాక తప్పదని వారు హెచ్చరించారు. ఈ ప్రదర్శనలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలు మణెమ్మ, సూర్య శోభ ,తాళ్ల శారద, పుష్ప, భానుచందర్ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin