Sunday, 26 July 2026 11:35:07 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగులు...

Date : 12 June 2023 02:21 AM Views : 535

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కదిరి మున్సిపాలిటీ ఆవరణం లో దివంగత నేత శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్ట్ ఉద్యోగుస్తులను క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పించిన సందర్భంగా ప్యారామెడికల్ ఉద్యోగస్తులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి కదిరి శాసనసభ్యులు డాక్టర్ పి వి సిద్దా రెడ్డి ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పి వి సిద్దా రెడ్డి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగస్తులు విన్నవించుకున్న వినతికి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేస్తూ నేడు క్యాబినెట్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన చేస్తున్న ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేస్తూ జీవోను విడుదల చేయడం జరిగిందన్నారు. 2014 సంవత్సరం నాటికి తమ సర్వీస్ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను నేడు క్రమబద్ధీకరించి, ఉద్యోగ భద్రత కల్పించి, రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల కుటుంబాలలో ఆనందాన్ని నింపారన్నారు. జగనన్న మాటతప్పుడు మడమ తిప్పడు అన్న ఆయన తీరు మరోసారి నిరూపితమైందని తెలియజేశారు. ఆనాడు ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దెబ్బతిన్నా కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి నేడు 98.55% కుపైగా అమలుపరిచిన ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డి దేనన్నారు. ఒకవైపు సంక్షేమం మరొకవైపు అభివృద్ధిని సమంగా ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. మరి ఈనాడు దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసే విధంగా జగనన్న పాలను కొనసాగిస్తున్నారని, వారికి మన అందరి అండదండలు కావాలని ఆకాంక్షించారు. థాంక్యూ సీఎం అంటూ నినాదాలతో ఉద్యోగస్తులు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల కుటుంబాలకు అండగా ఉంటూ మరి ఈనాడు మాకు ఉద్యోగ భద్రత కల్పించి రెగ్యులరైజ్ చేసినందుకు మా కుటుంబాలు ఎల్లవేళలా జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటాయని, వారికి ప్రతి ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగస్తుని తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ప్రజా ప్రతినిధులు,( ఏపీ ఎన్ జి ఓ ) ప్రెసిడెంట్ వేణుగోపాల్ రెడ్డి , ఫిరోజ్ , మహబూబ్ బాషా,రవి కుమార్ ,రమేష్ , రామ్మోహన్ , జనార్దన , మురళిదర్ రెడ్డి, పారామెడికల్ ఉద్యోగులు తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: