సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం లో కాంగ్రెస్ పార్టీ ప్రజా చైతన్య యాత్ర రెండవ రోజు పినపాక నియోజకవర్గం బుధవారం బూర్గంపాడు లో కొనసాగింది. ఈ క్రమంలో పాలిబోయిన శ్రీవాణి పలువురు నేతలు కార్యకర్తలు గ్రామంలో పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆనాడు చేసినటువంటి అభివృద్ధి పనులను తెలియజేస్తూ ప్రచారం చేశారు. ఇంటింటి ప్రచారంలో వరంగల్ రైతు డిక్లరేషన్, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ విధి విధానాలను వివరిస్తూ స్థానికులకు అవగాహన కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు శ్రీవాణి ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కర్ణాటక ఫలితాలు తెలంగాణలో పునరావతం అవుతాయని పేద మధ్యతరగతి వారికి ధైర్యం కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారం కు వచ్చిన వెంటనే గిరిజనులకు పోడు భూములు పట్టాలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు సహాయం రైతులకు రెండు లక్షల రుణమాఫీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ రైతులకు గిట్టుబాటు ధర మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఆడపడుచులకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇలా ఎన్నో సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజా చైతన్య యాత్రను కొనసాగిస్తున్నారు. యారం శేశిరెడ్డి మంద నాగరాజు వారి సహకారంతో ఈ ప్రజా చైతన్య యాత్ర కొనసాగింది. ఈ యాత్రలో వీరయ్య రాంబాబు వసంతు రాజు శంకర్ బి రాజు నరసింహారావు వెంకటేష్ మహేష్ చిరంజీవి నాగరాజు కార్తీక్ శ్రీను సోషల్ మీడియా సభ్యులు తదితరులు ఉన్నారు.
-----------------------
Admin