సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ఓజో ఆధ్వర్యంలో హుజూర్ నగర్ నియోజకవర్గం మొత్తం ఇప్పటికే 15 చోట్ల బొడ్రాయి కార్యక్రమాలకి సహకారం గోపాల పురం లోని బొడ్రాయి సంధర్భంగా మహా అన్నదానం కార్య క్రమం చేయించిన పిల్లుట్ల రఘు సూర్య పేట జిల్లా గోపాల పురం గ్రామ ప్రజలందరు కలిసి బొడ్రాయి కార్య క్రమం చేసుకోవాలని దానికి అండగా పిల్లుట్ల రఘు ఉండాలి అని కొద్ది రోజుల క్రితం కలవడం జరిగింది. వాళ్ళు అడిగిన వెంటనే స్పందించి హుజూర్ నగర్ నియోజకవర్గం లో పిల్లుట్ల రఘు మహా అన్నదానం కార్య క్రమం నిర్వహిస్తా అని చెప్పడం చెప్పిన మాట ప్రకారం గ్రామస్థులందరికి దాదాపు 3,00,000 రూపాయల వరకు కర్చు పెట్టీ మహా అన్నదానం కార్య క్రమం చేయడం జరిగింది. గ్రామస్థులందరూ రఘు అన్న నీ ముఖ్య అతిథిగా బారి ర్యాలీగా జన సంద్రోహమ్ తో తీసుకు వచ్చి ప్రతేక పూజలు నిర్వహించారు. అనంతరం రఘు అన్నదానం కార్య క్రమం ప్రారంభించి మాట్లాడుతూ నియోజక వర్గం మొత్తం ఎన్నో గ్రామాలలో స్వంత డబ్బుతో బొడ్రాయి కార్య క్రమాలు చేశానని రాబోయే రోజుల్లో ఒక్క అవకాశం ఇచ్చి చూడండి పార్టీలకతీతంగా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని నియోజకవర్గంలో నిరుపేద కుటుంబం అనేది లేకుండా చేస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఇంఛార్జి కుక్కల వెంకన్న గ్రామ పెద్దలు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin