సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : అమడుగూరు మండలం తుమ్మల గ్రామం తుమ్మలకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల మావాస్య ఒక పొద్దున సందర్భంగా మూడవ శనివారం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కొక్కంటి చెందిన భక్తుడు కొట్టు అశ్వర్థ కుమార్ సహకారంతో అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చింత శరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కొండకు వచ్చే భక్తులకు ఏర్పాట్లు సౌకర్యాలు కల్పించడం రాబోయే రోజుల్లో కొండమీద మంచినీటి వసతిని, రోడ్డు సౌకర్యం చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు గోపిశెట్టి శ్రీనివాసులు, మేకల చలపతి, కిషోర్ కుమార్ ,అనిల్ కుమార్, యోగి ,ధీరజ్ ,పవన్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin