సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కదిరి నియోజకవర్గ వై.సి.పి నేత డాక్టర్ బత్తల హరిప్రసాద్ జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించిన వై.సి.పి పార్టీ శ్రేణులు,వడ్డెర సంఘాలు,బిసి సంఘాలు,బత్తల యువసేన నాయకులు *వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ బత్తల హరిప్రసాద్ జన్మదిన వేడుకలను కదిరిలో అత్యంత ఘనంగా నిర్వహించడము జరిగింది. హరిప్రసాద్ నివాసం వద్ద పార్టీ కార్యకర్తలు,నాయకులు వందలాది మంది సమక్షంలో కేక్ కటింగ్ చేసి,స్వీట్స్ పంచిపెట్టారు అనంతరం కుమ్మరవాండ్ల పల్లి నుండి బైక్ ర్యాలీతో వెళ్ళి, బాణాసంచా పేలుళ్ళతో పట్టణం అంతా కలియ తిరిగారు. అనంతరం వడ్డెర సంఘం నాయకుల ఆధ్వర్యంలో మొటుకుపల్లి వద్ద వున్న ఆర్.డి.టి సంస్థ లోని సుమారు 200 మంది బుద్దిమాంధ్యము పిల్లలకు పండ్లు,బ్రెడ్లు అందజేశారు ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు ఖాజా, ముభారక్ బత్తల యువసేన ఆధ్వర్యంలో పండ్లు,బ్రెడ్లు పంచి పెట్టారు... ఈ సంధర్భంగా వక్తలు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళుగా కదిరి నియోజకవర్గములో డాక్టర్ బత్తల హరిప్రసాద్ అనేక సేవాకార్యక్రమాలైన మెడికల్ క్యాంప్ లు,ఆర్థిక సహాయాలు,లక్షలాది రూపాయలు దేవాలయాలకు ఇచ్చి అనేక సహాయ కార్యక్రమాలు చేసారని ప్రజాసేవ చేస్తూన్న డాక్టర్ బత్తల హరిప్రసాద్ కి ఎమ్మెల్యే గానో,ఎం.పి గానో చేసుకోవాలిని అందుకు అందరి సహాయం కావాలని వారి పుట్టిన రోజు సంధర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో కుమ్మర వాండ్ల పల్లి మాజీ సర్పంచ్ బత్తల వెంకటరమణ, కుమ్మర వాండ్ల పల్లి ఎమ్ పి.టి.సి వైస్ ఎం.పి.పి బత్తల ఆదినారాయణ,వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరి పట్టణ అధ్యక్షులు బాహుద్దీన్,బిసి వడ్డెర నాయకులు సంపంగి గోవర్ధన్,వడ్డెర సంఘం నాయకులు సైదాపురము రమణ,అల్లుగుండు నారాయణ స్వామి,గాజీ గాని పల్లి నర్సింహులు,బత్తల యువసేన వై.సీ.పి నాయకులు నాయకులు ముభారక్, ఖాజా,షామీర్ భాషా,సిద్దుగూరి పల్లి వడ్డెర నాయకులు ఇడగొట్టు శంకర, వల్లెపు నాగార్జున్, ఇడగొట్టు కిరణ్, బత్తల శ్రావన్,మొహబూబ్ బాషా,బలపాల చంద్ర, తదితర పాల్గొన్నారు.
-----------------------
Admin